నడిరోడ్డుపై రెచ్చిపోయిన ప్రేమ జంట అరెస్ట్..!

ABN , First Publish Date - 2022-04-24T17:08:50+05:30 IST

కర్ణాటకకు చెందిన ఓ యువజంట నడిరోడ్డుపైనే హల్‌చల్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.

నడిరోడ్డుపై రెచ్చిపోయిన ప్రేమ జంట అరెస్ట్..!

కర్ణాటకకు చెందిన ఓ యువజంట నడిరోడ్డుపైనే హల్‌చల్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. నలుగురు చూస్తున్నారనే విషయాన్ని కూడా మరిచి ఆ ప్రేమికులిద్దరూ బైక్‌పై వెళ్తూ ముద్దుల్లో మునిగి తేలారు. బిజీగా ఉన్న రోడ్డులో బండి మీదే రొమాన్స్ సాగించారు. ఈ దృశ్యం చూసి అటుగా వెళ్లే వాళ్లు ఆశ్చర్యపోయారు. ఆ వీడియో చామరాజ నగర్ పోలీసుల వరకు వెళ్లింది. దీంతో వారు ఆ ప్రియుడిని అదుపులోకి తీసుకున్నారు. బైకు నంబర్‌ ఆధారంగా నిందితుడు ఎస్‌సి స్వామిని అరెస్ట్‌ చేశారు. నిర్లక్ష్యపు డ్రైవింగ్, న్యూసెన్స్‌ సెక్షన్ల కింద కేసులు పెట్టారు. 


కర్ణాటకలోని చామరాజనగర్‌లోని గుండ్లుపేట రోడ్డుపై ఓ జంట బైక్‌పై వెళ్తూనే రొమాన్స్ సాగించింది.  అమ్మాయి పెట్రోల్ ట్యాంకు మీద అబ్బాయికి ఎదురుగా కూర్చొని ఉంది. అబ్బాయి బండి నడుపుతుంటే అతడ్ని గట్టిగా కౌగిలించుకొని ముద్దులు పెట్టింది. అతడు ఆమెతో సరసాలు ఆడుతూనే బైక్‌ను నడిపాడు. రోడ్డుపై వాహనాలు వస్తూ పోతూ ఉన్నా సరే వారు రొమాన్స్ ఆపలేదు. చుట్టుపక్కలవాళ్లు గమనిస్తున్నారన్న సోయి లేకుండా ఈ జంట రొమాన్స్‌లో మునిగిపోయింది. 

Updated Date - 2022-04-24T17:08:50+05:30 IST