ఛీ..ఛీ.. వీడసలు మనిషేనా.. సొంత చెల్లెళ్లపైనే అత్యాచారం.. అడ్డొచ్చిన కన్న తల్లిని కూడా..
ABN , First Publish Date - 2022-04-29T18:24:42+05:30 IST
కామంతో కళ్లు మూసుకుపోయిన వాడికి వావి వరసలు తెలియవంటారు.
కామంతో కళ్లు మూసుకుపోయిన వాడికి వావి వరసలు తెలియవంటారు. ఝార్ఖండ్‌కు చెందిన ఓ మృగాడు సొంత చెల్లెళ్లపైనే అత్యాచారానికి పాల్పడ్డాడు. అడ్డు వచ్చిన తల్లిపై కూడా లైంగిక వేధింపులకు దిగాడు. దీంతో ఆ మాతృమూర్తి తన కొడుకును పోలీసులకు పట్టించింది. జార్ఖండ్ రాష్ట్రంలోని లోహర్దగా జిల్లాలో ఈ దారుణ ఘటన జరిగింది.
లోహర్దగా జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన కామాంధుడు సొంత చెల్లెళ్లపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఒక సోదరిపై గత మూడేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఇటీవల మరోసారి అత్యాచారానికి ప్రయత్నించగా ఆ బాలిక అరిచి గోల పెట్టింది. కేకలు విని అక్కను కాపాడేందుకు వచ్చిన చిన్న చెల్లిపై కూడా నిందితుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ బాలిక మైనర్. విషయం తెలుసుకున్న తల్లి కొడుక్కి బుద్ధి చెప్పేందుకు ప్రయత్నించింది. దీంతో తల్లిపై కూడా ఆ కామాంధుడు అత్యాచారానికి ప్రయత్నించాడు.
ఈ ఘటనపై తల్లి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. బాధితురాళ్ల నుంచి స్టేట్మెంట్లు తీసుకున్న పోలీసులు వారిని మెడికల్ టెస్ట్‌ల కోసం పంపించారు.