పగిలిపోయిన 10 రూపాయల టీ కప్పు.. పేలిన తూటా.. ఆస్పత్రి పాలయిన భర్త..!

ABN , First Publish Date - 2022-02-08T23:40:46+05:30 IST

కొన్నిసార్లు చిన్న చిన్న సమస్యలే చివరకు ప్రాణసంకటం అవుతుంటాయి. కొందరైతే మద్యం మత్తులో ఏం చేస్తుంటారో వారికే తెలీనంతగా ప్రవర్తిస్తుంటారు. పాట్నాలో జరిగిన ఘటన అందరినీ షాక్‌కు గురి చేసింది. టీ కప్పు విషయంలో మొదలైన గొడవ...

పగిలిపోయిన 10 రూపాయల టీ కప్పు.. పేలిన తూటా.. ఆస్పత్రి పాలయిన భర్త..!

కొన్నిసార్లు చిన్న చిన్న సమస్యలే చివరకు ప్రాణసంకటం అవుతుంటాయి. కొందరైతే మద్యం మత్తులో ఏం చేస్తుంటారో వారికే తెలీనంతగా ప్రవర్తిస్తుంటారు. పాట్నాలో జరిగిన ఘటన అందరినీ షాక్‌కు గురి చేసింది. టీ కప్పు విషయంలో మొదలైన గొడవ చివరకు.. చిలికి చిలికి గాలివానలా మారింది. పది రూపాయల టీ కప్పు కోసం జరిగిన ఈ గొడవ.. ఆఖరికి ఓ వ్యక్తిని ఆస్పత్రి పాలు చేసింది. వివరాల్లోకి వెళితే..


బీహార్ రాష్ట్రం పాట్నా పీసీ కాలనీలోని సత్యం పార్కు సమీపంలో సునీల్ మెహతా అలియాస్ కాళి అనే వ్యక్తి.. టీ దుకాణం నిర్వహిస్తుంటాడు. టీస్టాల్ సమీపంలోనే ఉన్న ఓ గుడిసెలో సునీల్ కుటుంబం నివాసం ఉంటోంది. ఇదిలావుండగా, సోమవారం సాయంత్రం సునీల్.. టీ దుకాణంలో ఉండగా ముగ్గురు యువకులు అక్కడికి వచ్చారు. టీ తాగే క్రమంలో రూ.10 విలువ చేసే కప్పు పగిలిపోయింది. ఈ విషయంలో సునీల్‌కు, యువకులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మధ్యలో అడ్డొచ్చిన సునీల్ భార్యను కూడా ఆ యువకులు దుర్భాషలాడారు. స్థానికులంతా గుమికూడడంతో వారు అక్కడి నుంచి పరారయ్యారు. అయితే కొద్దిసేపటికే మళ్లీ టీ దుకాణం వద్దకు వచ్చారు.

ఇదేం పని అని ఆశ్చర్యపోతున్నారా..? ఈ కుర్రాళ్లు తలపై గుండ్రంగా జుట్టును ఎందుకిలా తీసేశారో తెలిస్తే..


దుకాణదారుడు సునీల్‌తో కావాలనే గొడవ పెట్టుకున్నారు. ఈ క్రమంలో తుపాకీ తీసి, సునీల్ ఛాతిపై కాల్చి పారిపోయారు. గమనించిన స్థానికులు అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరిలించారు. అయితే పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దుండగుల కోసం గాలిస్తున్నారు. రూ.10 టీ కప్పు విషయంతో జరిగిన ఈ ఘటన.. స్థానికంగా సంచలనం కలిగించింది.

ఆలస్యంగా ఇంటికొచ్చిన భర్త.. బెడ్‌రూం తలుపు తట్టినా భార్య ఎంతకీ తీయలేదని.. చివరికి ఏం చేశాడంటే..

Read more