Bruce Lee : 32 ఏళ్ల వయసులో బ్రూస్ లీ ఆకస్మిక మరణానికి అదే కారణమా..?
ABN , First Publish Date - 2022-11-24T11:14:41+05:30 IST
పెయిన్ కిల్లర్ తీసుకున్న తర్వాత మెదడు వాపు వచ్చిందని డాక్టర్స్ చెప్పారు.
బ్రూస్ లీ అత్యంత ప్రసిద్ధ మార్షల్ ఆర్టిస్ట్, మంచి ప్రతిభ కలిగిన నటులలో ఒకరు, ఇతను జూలై 1973లో 32 సంవత్సరాల చిన్న వయస్సులోనే మరణించాడు. బ్రూస్ లీ మరణం అప్పట్లో పెద్ద సంచలనంగా నిలిచింది. ఈ మిస్టరీ చావు వెనుక అసలు నిజాలు ప్రపంచానికి తెలియనే లేదు. అతని మరణం చాలా సంవత్సరాలుగా ఆసక్తిగా మారింది. ఏదేమైనా, దాదాపు 50 సంవత్సరాల తరువాత, శాస్త్రవేత్తలు ఇప్పుడు లీ మరణంలోని సాక్ష్యాలను సమీక్షించారు. బ్రూస్ లీ ఎక్కువగా హైపోనాట్రేమియా కారణంగా మరణించినట్లు నిర్ధారించారు.

1973లో బ్రూస్ లీ మరణం సమయంలో శవపరీక్ష నివేదిక ప్రకారం లీ సెరిబ్రల్ ఎడెమాతో చనిపోయాడని తేలింది, మామూలుగా చెప్పాలంటే మెదడు వాపు. పెయిన్ కిల్లర్ తీసుకున్న తర్వాత మెదడు వాపు వచ్చిందని డాక్టర్స్ చెప్పారు.
అయినప్పటికీ, కొత్త అధ్యయనం ప్రకారం ఇప్పుడు ఎడెమా హైపోనాట్రేమియా ద్వారా సంభవించిందని సూచిస్తుంది. అతను నీటిని ఎక్కువగా తీసుకోవడం, మూత్రపిండాలు ఎక్కువగా నీటిని తీసుకోలేకపోవడం వల్ల, కూడా ఈ మరణానికి కారణం కావచ్చని అందుకే చిన్న వయస్సులోనే ఆకస్మికంగా మరణించినట్లు చెప్పారు. హైపోనట్రేమియా అనేది రక్తంలో సోడియం స్థాయి, ఇది ద్రవ సమతుల్యతకు అవసరమైనది.

లీ తన మరణానికి రెండు నెలల ముందు డబ్బింగ్ సెషన్ కోసం హాంకాంగ్‌లో ఉన్నప్పుడు సెరిబ్రల్ ఎడెమాతో బాధపడ్డాడు. బ్రూస్ లీని బాప్టిస్ట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు, అక్కడ సెరిబ్రల్ ఎడెమా నిర్ధారణ అయింది. లీకి మన్నిటోల్‌తో చికిత్స అందించారు. బ్రూస్‌లో హైపోనాట్రేమియాకు అనేక ప్రమాద కారకాలు ఉన్నాయని అధ్యయనం పేర్కొంది, ఇందులో అధిక పరిమాణంలో ద్రవం తాగడం, గంజాయిని ఉపయోగించడం వంటివి దాహాన్ని పెంచుతాయని..., అసమతుల్యతతో మెదడులోని కణాలతో సహా శరీరంలోని కణాలు ఉబ్బడానికి కారణమవుతుందని పెర్కొన్నారు.
లీ భార్య లిండా 77, 'ఎంటర్ ది డ్రాగన్' స్టార్ అకస్మాత్తుగా మరణించిన సమయంలో క్యారెట్, యాపిల్ జ్యూస్ ఆహారంగా తీసుకున్నారని తెలిపింది. 2018 జీవిత చరిత్ర 'బ్రూస్ లీ, ఎ లైఫ్' రాసిన మాథ్యూ పాలీ, బ్రూస్ మరణించిన సాయంత్రం పదేపదే నీరు తీసుకోవడం గురించి ప్రస్తావించారు. బ్రూస్ తరచుగా గంజాయిని ఉపయోగించినట్లు అందులో నివేదించబడింది.

నీటి హోమియోస్టాసిస్ అంటే తీసుకున్న నీటిని విసర్జించలేకపోవడం., లీ మరణించిన సమయంలో మూత్రంలో నీటిని విసర్జించడం వీలుకాకపోతే అది హైపోనాట్రేమియా, సెరిబ్రల్ ఎడెమా గా మారి గంటలలో మరణానికి దారితీయవచ్చు. బ్రూస్ లీ మూత్రపిండం పనిచేయకపోవడం వల్ల మరణించినట్లు అధ్యయనం నిర్ధారించింది. ఎంతో ప్రతిభ కలిగిన బ్రూస్ లీ అకస్మికంగా చనిపోవడానికి అతని శత్రువులు కారణమనే మరో వాదన కూడా ఉంది. అయితే అతని అలవాట్లే అతనిని చావుకు దగ్గర చేసాయని మొత్తానికి ఈ కొత్త నివేదిక తేల్చింది.