కలలో డబ్బు, బంగారం కనిపిస్తే శుభమా? అశుభమా?
ABN , First Publish Date - 2022-11-04T13:17:01+05:30 IST
నిద్రలో ఉన్నప్పుడు చాలా కలలు వస్తుంటాయి. ఇందులో కొన్ని కలలు మనల్ని భయాందోళనలకు గురి చేస్తే.. మరికొన్నేమో సంతోషం కలిగిస్తాయి. ఇంకొన్ని మాత్రం ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఇకపోతే అప్పుడప్పుడు బాగా డబ్బులు పొందినట్టు లేదా ఉన్న పైసలన్నీ కల్పోయినట్టూ కూడా మనకు కలలు వస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో
ఇంటర్నెట్ డెస్క్: నిద్రలో ఉన్నప్పుడు చాలా కలలు వస్తుంటాయి. ఇందులో కొన్ని కలలు మనల్ని భయాందోళనలకు గురి చేస్తే.. మరికొన్నేమో సంతోషం కలిగిస్తాయి. ఇంకొన్ని మాత్రం ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఇకపోతే అప్పుడప్పుడు బాగా డబ్బులు పొందినట్టు లేదా ఉన్న పైసలన్నీ కల్పోయినట్టూ కూడా మనకు కలలు వస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో అయితే.. బంగారు ఆభరణాలు, వాటి శబ్దాలకు సంబంధించిన కలలు కూడా కంటూ ఉంటాం. అయితే.. ఇలా డబ్బులు, బంగారు ఆభరణాలకు సంబంధించిన కలలు వస్తే అశుభమని కొందరు భావిస్తూ ఉంటారు. ఈ క్రమంలో బంగారం, నగలు కలలో కనిపిస్తే నిజంగా అశుభమా? లేక శుభమా? అనే విషయాలను ఓసారి పరిశీలిస్తే..
ఎవరి వద్ద నుంచి అయినా డబ్బులు తీసుకుంటున్నట్టుగానీ లేదా బ్యాంకులో నగదును డిపాజిట్ చేస్తున్నట్టుగానీ నిద్రలో కల వస్తే అది శుభ సూచకమని స్వప్నశాస్త్రం చెబుతోంది. ఇలాంటి కలలుగన్న వాళ్ల జీవితంలోకి సమీప భవిష్యత్తులోనే భారీగా నగదు వస్తుందట. ఫలితంగా కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుందని శాస్త్రంలో పేర్కొంటుందట. ఒకవేళ డబ్బును కోల్పోయినట్టుగానీ, చిరిగిన నోట్లుగానీ కల వస్తే అది చెడు సంకేతమట. ఆర్థిక ఇబ్బందులు తలెత్తబోతున్నాయనడానికి దాన్ని చిహ్నంగా భావించాలని శాస్త్రం తెలుపుతోంది.
అలాగే.. బంగారం, బంగారు ఆభరణాలు కలలో కనిపించినా.. వాటి సంబంధించిన శబ్దాలు వినిపించినా అశుభంగా పరిగణించాట. వ్యాపారాల్లో, చేస్తున్న ఉద్యోగాల్లో ఆర్థికంగా నష్టం జరిగే అవకాశం ఉండటంతోపాటు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయనడానికి వాటిని సంకేతంగా భావించాలని స్వప్నశాస్త్రం చెబుతోంది.