Viral News: కేంద్రం కొత్త స్కీం.. ప్రతి ఆడ పిల్లకు నెలకు రూ.5వేలు.. నెట్టింట వైరలవుతున్న వార్త.. దీనిపై అధికారులు ఏమన్నారంటే..

ABN , First Publish Date - 2022-08-31T13:29:37+05:30 IST

కేంద్రంలోని నరేంద్ర ప్రభుత్వం కొత్త స్కీంను ప్రవేశ పెట్టింది. ‘పీఎం కన్యా ఆశ్వీర్వాద్ యోజన’ పేరుతో ఆడ పిల్లలకు అండగా నిలవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగానే నెల నెలా వారికి రూ.5వేల ఆర్థిక సాయాన్ని అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీ

Viral News: కేంద్రం కొత్త స్కీం.. ప్రతి ఆడ పిల్లకు నెలకు రూ.5వేలు.. నెట్టింట వైరలవుతున్న వార్త.. దీనిపై అధికారులు ఏమన్నారంటే..

ఇంటర్నెట్ డెస్క్: కేంద్రంలోని నరేంద్ర ప్రభుత్వం కొత్త స్కీంను ప్రవేశ పెట్టింది. ‘పీఎం కన్యా ఆశ్వీర్వాద్ యోజన’ పేరుతో ఆడ పిల్లలకు అండగా నిలవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగానే నెల నెలా వారికి రూ.5వేల ఆర్థిక సాయాన్ని అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అనే వార్త గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ క్రమంలోనే ప్రభుత్వ అధికారులు స్పందించారు. కీలక విషయాన్ని ప్రకటించారు. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..



ఆడ పిల్లల మేలు కోసం PM Modi నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ‘PM Kanya Aashirwad Yojana’ పేరుతో ఇప్పటికే ఓ పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ స్కీంలో చాలా మంది రిజిస్టర్ కూడా అయ్యారు. ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వం(Indian Govt) ఆడ పిల్లలకు లబ్ధి చేకూర్చేందుకు ‘పీఎం కన్యా ఆశ్వీర్వాద్ యోజన’ పేరుతో మరో పథకాన్ని ప్రవేశ పెట్టిందంటూ కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. ఈ క్రమంలో చాలా మంది దాన్ని ఇతరులతో షేర్ చేయడంతోపాటు ఇంటర్నెట్‌లో దాని గురించి విపరీతంగా సెర్చ్ చేస్తున్నారు. దీంతో అధికారులు స్పందించారు. య్యూట్యూబ్‌లో వైరల్ అవుతున్నట్టు పీఎం కన్యా ఆశ్వీర్వాద్ యోజన’ పేరుతో ప్రభుత్వం ఎటువంటి పథకాన్ని ప్రారంభించలేదని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఇటువంటి వార్తలను అస్సలు నమ్మవద్దని సూచించారు. 


Updated Date - 2022-08-31T13:29:37+05:30 IST