ప్రపంచంలో వృథా అవుతున్న ఆహారం అధికమా?... ఆకలితో అలమటిస్తున్నవారు అధికమా?... సమాధానం ఇదేనని తెలిస్తే...

ABN , First Publish Date - 2022-09-29T16:52:54+05:30 IST

భారత్‌తో పాటు అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న...

ప్రపంచంలో వృథా అవుతున్న ఆహారం అధికమా?... ఆకలితో అలమటిస్తున్నవారు అధికమా?... సమాధానం ఇదేనని తెలిస్తే...

భారత్‌తో పాటు అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న పలు దేశాలలో ఆహార వృథా పెద్ద సమస్యగా మారింది. ఈ విషయంలో చైనా తరువాత భారత్ రెండవ స్థానంలో ఉంది. ఈ రెండు దేశాలలో ఆహార వృథా అధికంగా ఉంటోంది. మరోవైపు  చూస్తే ప్రపంచంలో 83 కోట్ల మంది ప్రజలు ఆకలి బాధతో అలమటిస్తున్నారు. ఆహార కొరత, వృథాలపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు ప్రతీ ఏటా సెప్టెంబరు 29న ’ఇంటర్నేషనల్ డే ఆఫ్ అవేర్‌నెస్ ఆఫ్ ఫుడ్ లాస్ అండ్ వేస్ట్‘ను నిర్వహిస్తున్నారు. ఈ రోజున ఆహార పదార్థాల వృథా నివారణపై ప్రజలకు అవగాహన కల్పించనున్నారు.  


ప్రపంచంలోని 10శాతం జనాభా అంటే 83 కోట్ల మంది ఆకలితో అలమటిస్తూనే నిద్రిస్తున్నారు. 

ప్రపంచవ్యాప్తంగా ప్రతీ ఏటా 250 టన్నుల ఆహారం వృథా అవుతోంది. 

నేషనల్ సర్వే తెలిపిన వివరాల ప్రకారం భారత్‌లో ప్రతీరోజూ 19 కోట్లమంది ఆకలితోనే పడుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నారు. 

భారత్‌లో ఉత్పత్తి అవుతున్న ఆహార పదార్థాలలో 40శాతం వృథాగా పోతోంది. 

భారత్‌లో ప్రతీ ఏటా రూ. 92 వేల కోట్ల విలువైన ఆహార ఉత్పత్తులు వృథా అవుతున్నాయి. 

116 దేశాలకు చెందిన హంగర్ ఇండిక్స్ సర్వే-2021లో భారత్ 101వ స్థానంలో ఉంది. 

యూఎన్ఐపీ రిపోర్టు ప్రకారం ఈ లిస్టులో మొదటి స్థానంలో చైనా ఉంది. ఇక్కడ ప్రతీ ఏటా 9.6 కోట్ల టన్నుల ఆహారం వృథా అవుతోంది. ఇక భారత్ విషయానికొస్తే ప్రతీ ఏటా 6.78 కోట్ల టన్నుల ఆహారం వృథా అవుతోంది. 

Read more