International Civil Aviation Day: ఆకాశ వారధికి కష్టాలు తప్పలేదు..
ABN , First Publish Date - 2022-12-07T15:28:28+05:30 IST
ఒక్క విమాన సంస్థని కాదు మొత్తం విమానయాన రంగం కొన్నేళ్ళుగా ఇంబ్బందుల్లో ఇరుక్కుపోయింది.
ఎగిరే ఆకాశ కపోతాలు, ప్రయాణ సమయాన్ని తగ్గించి తన రెక్కలపై ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు తీసుకుపోయే వారధులు విమానాలు. అయితే గత కొన్నేళ్ళుగా విమానయాన సంస్థలు కష్టాల్లో కూరుకుపోతున్నాయా..? అంతర్జాతీయ పౌర విమానయాన ఒప్పందంపై 1944లో, 54 దేశాలు కలిసి సంతకం చేశాయి, దీనిని 'చికాగో కన్వెన్షన్' అని కూడా పిలుస్తారు. ఈ సమావేశం గగనతలం, విమానాల నమోదు, భద్రత నియమాలను ఆమోదించిన సందర్భంగా ఈరోజున అంతర్జాతీయ పౌర విమానయాన దినోత్సవం జరుపుకుంటారు.

కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్..విజయమాల్యా
ప్రముఖ పారిశ్రామిక వేత్త విజయ్ మాల్య యాజమాన్యంలో కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ 2003లో ప్రారంభమైంది. ఖరీదైన విమాన ప్రయాణాన్ని మరింత ఖరీదైనదిగా మార్చి, విలాసవంతమైన ప్రయాణంగా చేసాడు విజయమాల్య. తొలి కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ విమానం ముంబయి నుంచి ఢిల్లీ వరకు నడిచింది.
డెక్కన్ ఎయిర్ వేస్..గోపినాధ్
సామాన్యుడికి విమాన ప్రయాణ సౌకర్యాన్ని కల్పించిన వాడు గోపీనాధ్. చవక ధరలకే విమాన ప్రయాణాన్ని అందించిన వ్యక్తి. సామాన్యులు కూడా విమానాల్లో ఎగురవచ్చని ఈ సంస్థ నిరూపించింది. తన జీవిత కాలంలో ఒక్కసారైనా విమానంలో ప్రయాణించాలనేది ప్రతి ఒక్కరూ కల కంటూ ఉంటారు. అలాంటి వారి కలను సాకారం చేసాడు గోపినాథ్. డెక్కన్ ఎయిర్ వేస్ తన సేవలను ఆగస్టు 23, 2003లో బెంగళూరు నుంచి హుబ్లీకి ప్రారంభించింది.
ఈ మధ్య కాలంలో విమానయాన పరిశ్రమ పెద్ద సంక్షోభంలో పడింది. చరిత్రలో వెనక్కు వెళితే అమెరికా మీద జరిగిన దాడుల్లో సెప్టెంబర్ 11, 2001న విమానాలతో ట్విన్ టవర్స్ ని కూల్చివేసారు. బిన్ లాడెన్, ఆల్ ఖైదా తీవ్రవాదులు కలిసి చేసిన దాడులలో ఎందరో ప్రాణాలను పోగొట్టుకున్నారు. ఆ దాడుల తరువాత అమెరికన్లు విమాన ప్రయాణమంటేనే ఒణికిపోయారు. విమానాలు ఎక్కడం మానేశారు. విమానయాన పరిశ్రమ దీనితో కుదేలైంది. ఎయిర్ లైన్స్ అధిపతులంతా మొదట మాజీ అధ్యక్షుడైన బిల్ క్లింటన్ ని కలిసి తమ ఇబ్బందినంతా మొరపెట్టుకున్నారు. దేశ ఆర్థిక పరిస్థితులు సంక్షోభంలో పడటంతో స్వయంగా క్లింటనే ముందుకు వచ్చి 48 గంటల పాటు విమానాల్లో తిరిగి, క్షేమంగా వచ్చినా కూడా అమెరికా ప్రజల్లో భయం పూర్తిగా పోలేదు.
ఫలితమూ కనిపించలేదు. విమాన ప్రయాణం అంటే ప్రజల్లో భయం తగ్గలేదు. క్లింటన్ వీవీఐపి కాబట్టి భద్రతావలయాలు, కట్టుదిట్టాల మధ్య ప్రయాణించాడు కానీ అదే మామూలు సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. సమస్య పరిష్కారం కాకపోయే సరికి ఎయిర్ లైన్స్ అధికారులు అధ్యక్షుడు జార్జ్ బుష్ ని కలిశారు. ప్రజల నాడి తెలిసిన బుష్ షికాగో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ రన్ వే మీద మీటింగ్ పెట్టాడు. మానవుడి స్వేచ్ఛ మీద దాడిని ఖండిద్దామని పిలుపునిచ్చాడు. స్వేచ్ఛగా ఎగిరే స్వతంత్రాన్ని పోగొట్టుకోవద్దని స్వేచ్ఛ కోసం జరిగే మహోయుద్ధమని నమ్మకం కలిగిస్తే తప్ప ప్రజలలో నమ్మకం కుదరలేదు. విమాన పరిశ్రమ మళ్లీ ఊపందుకుంది. ఊపిరి పీల్చుకుంది.
మళ్ళీ అలాంటి దారుణ సందర్భాన్ని మళ్ళీ కరోనాతో 20 ఏళ్ల తరువాత విమానయాన పరిశ్రమ ప్రపంచ వ్యాప్తంగా కుదేలయింది. కోవిడ్ మహమ్మారి కారణంగా ప్రపంచం అంతా గడగడలాడిపోయింది. ప్రతి ఒక్కరూ ఇళ్ళకే పరిమితమైపోయి, దుర్భలమైన సమయాలను గడిపారు. అంతటి సంక్షోభంలో అన్ని పరిశ్రమలలానే విమానయాన పరిశ్రమ కూడా కుదేలైపోయింది. ఒక్క విమాన సంస్థని కాదు మొత్తం విమానయాన రంగం కొన్నేళ్ళుగా ఇంబ్బందుల్లో ఇరుక్కుపోయింది.
మొత్తం విమానయాన సంస్థలన్నీ చిక్కుల్లో పడ్డ్డాయి. దీనికి మరిన్ని కారణాలు కూడా లేకపోలేదు. పెరుగుతున్న ఇంధనం ధరలు, అధిక పన్నులు, తక్కువ డిమాండ్, తీవ్రమైన పోటీ వంటి పరిస్థితుల కారణంగా కూడా ఇబ్బందులు తప్పలేదు. ప్రస్తుతం భారత్ లో నడుస్తున్న ఎనిమిది ఎయిర్ లైన్స్ సంస్థల్లో దక్కన్ సంస్థ మాత్రమే తన కార్యకలాపాలను నిలిపేసింది. ఎయిర్ లైన్స్ సిబ్బందికి వేతన రహిత సెలవులను ప్రకటించింది. వస్తున్న రాబడి నిలిచిపోవడం, ఇంధనం ఖర్చులు. నిర్వహణకు అయ్యే ఖర్చులు, పార్కింగ్ చార్జీలతో పాటు విమాన సంస్థల నియంత్రణ లేకపోవడం ఈ పరిస్థితికి కారణాలుగా చెప్పచ్చు.