మామిడి పండ్లకు సంబంధించిన ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా?
ABN , First Publish Date - 2022-04-13T16:33:49+05:30 IST
మామిడిని పండ్లలో రారాజు అని పిలుస్తారు.
మామిడిని పండ్లలో రారాజు అని పిలుస్తారు. దేశంలో 1,500 కు మించిన మామిడి రకాలు ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యధికంగా 25 మిలియన్ టన్నుల మామిడిపండ్లు భారతదేశంలోనే ఉత్పత్తి అవుతున్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో ఇండోనేషియా, చైనా, మెక్సికో, పాకిస్థాన్ ఉన్నాయి. భారతదేశంలో మామిడిపండుకు ప్రజల్లో ప్రత్యేకమైన ఆదరణ ఉంది. మామిడి షేక్ నుండి స్వీట్స్ వరకు వేసవిలో మామిడిని పలు రకాలుగా ఉపయోగిస్తారు. అయితే మామిడికి సంబంధించి కొద్ది మందికి మాత్రమే తెలిసిన విషయాలు చాలా ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. పచ్చి మామిడికాయ పులుపుగానూ, పండిన తర్వాత అది తీపిగానూ ఎందుకు ఉంటుందో తెలుసా? దీనికి కారణం... మామిడి పచ్చిగా ఉన్నప్పుడు, ఎక్కువ ఆమ్లం, తక్కువ చక్కెర ఉంటుంది. పండు పండినప్పుడు యాసిడ్ తగ్గుతుంది. సహజ చక్కెర పెరుగుతుంది. అందుకే అవి వండినప్పుడు తియ్యగా మారతాయి.
ఇక చౌసా మామిడి రకానికి ఒక కథ ఉంది. 1539లో బీహార్‌లోని చౌసాలో జరిగిన యుద్ధంలో షేర్ షా సూరి హుమాయూన్‌ను ఓడించాడు. ఈ విజయం సాధించిన ఆనందంలో షేర్ షా తనకు ఇష్టమైన మామిడిపండుకు చౌసా అని పేరు పెట్టాడు. అప్పటి నుంచి ఈ పేరుతోనే పిలుస్తారు. అయితే ఈ మామిడి ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్ జిల్లాలో పుట్టింది. మార్కెట్‌లో ఆగస్టు వరకు మామిడి రకాలు వస్తున్నప్పటికీ, సీజనల్ మామిడి మార్చి-ఏప్రిల్ నుండి ప్రారంభమవుతుంది. ఈ సమయంలో రత్నగిరి, హాపుస్, మాల్గోవా, సఫేదా, సిందూరి, దస్సెహ్రీ రకాల మామిడి మార్కెట్‌కు చేరుకోవడం ప్రారంభమవుతుంది. మామిడి సీజన్ ముగిసే సమయానికి కేరళ, కర్ణాటకలో పండే నీలమణి వస్తుంది. అల్ఫోన్సో మామిడి పండు ఎక్కువగా ఎగుమతి అవుతుంటుంది.. ఇది మహారాష్ట్రలో పండే మామిడి. ఇది ఇతర మామిడి పండ్ల కంటే తీపి, రుచి. వాసన పరంగా భిన్నంగా ఉంటుంది. ఈ మామిడి పండిన తర్వాత కూడా వారం రోజుల వరకు పాడవకుండా ఉంటుంది. అందుకే ఎక్కువగా ఎగుమతి అవుతుంది. ఇది ఇతర మామిడి పండ్ల కంటే ధరలో కొంచెం ఎక్కువగా ఉంటుంది.