-
-
Home » Prathyekam » Indian Railways has issued an important alert on cancellation of train ticket even after chart preparation kjr spl-MRGS-Prathyekam
-
Train Ticket Cancellation: రైల్వే ప్రయాణీకులకు ఇంపార్టెంట్ అలెర్ట్.. Chart ప్రిపేర్ అయిన తర్వాత కూడా టికెట్‌ను కేన్సిల్ చేస్తే..
ABN , First Publish Date - 2022-10-13T00:45:43+05:30 IST
ప్రపంచంలోని అతి పెద్ద రైల్వే సంస్థలలో ఒకటిగా ఆవిర్భవించిన భారతీయ రైల్వే (Indian Railways) .. ప్రయాణికులకు విశేష సేవలు అందిస్తోంది. అలాగే ప్రయాణికుల నుంచి రైల్వేకు..

ప్రపంచంలోని అతి పెద్ద రైల్వే సంస్థలలో ఒకటిగా ఆవిర్భవించిన భారతీయ రైల్వే (Indian Railways) .. ప్రయాణికులకు విశేష సేవలు అందిస్తోంది. అలాగే ప్రయాణికుల నుంచి రైల్వేకు ఆదాయం కూడా భారీగానే వస్తోంది. దీంతో ప్రయాణికుల సౌకర్యార్థం.. రైల్వే అధికారులు వివిధ మార్పులు చేపడుతుంటారు. రైలు ప్రయాణం అంటేనే నెలల ముందు టికెట్ బుక్ చేసుకోవాల్సిన పరిస్థితి. ఇక పండుగల సమయాల్లో అయితే ఎంత డిమాండ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే టికెట్ బుక్ చేసుకున్న వారు.. తీరా ప్రయాణ సమయం దగ్గరపడ్డాక వివిధ కారణాల వల్ల టికెట్లను కేన్సిల్ చేసుకుంటుంటారు. దీని వల్ల క్యాన్సిలేషన్ చార్జీలు పోనూ మిగతా మొత్తాన్ని పొందే వీలు ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే.. అయితే ప్రయాణికుల చార్ట్ రద్దు చేసిన తర్వాత కేన్సిల్ చేసుకుంటే డబ్బులు తిరిగి వస్తాయా..! అనే సందేహం చాలా మందికి ఉంటుంది. అయితే దీనిపై భారతీయ రైల్వే క్లారిటీ ఇచ్చింది.
టికెట్ రద్దు చేసుకున్న వారికి క్యాన్సిలేషన్ చార్జీలు పోనూ మిగతా మొత్తాన్ని అందజేస్తారు. అయితే చాలా సార్లు ప్రయాణికుల చార్ట్ సిద్ధం చేసిన తర్వాత కూడా టిక్కెట్లను రద్దు చేసుకుంటూ ఉంటారు. అలాంటి సమయాల్లో డబ్బులు తిరిగి వస్తాయో, రావో అనే సందేహం చాలా మందికి ఉంటుంది. ఈ సందేహాలను నివృత్తి చేస్తూ.. చార్జింగ్ పూర్తయిన తర్వాత టికెట్లు రద్దు చేసుకున్న వారు కూడా మొత్తాన్ని తిరిగి పొందవచ్చని ఐఆర్‌సీటీసీ (Indian Railway Catering and Tourism Corporation) తెలిపింది. ఇందుకోసం రైల్వే నిబంధనల ప్రకారం టిక్కెట్ డిపాజిట్ రసీదును (TDR) సమర్పించాల్సి ఉంటుంది. అదెలాగంటే..
Viral Video: ట్రైన్‌కు వేళాడుతూ ఇన్‌స్టా రీల్ కోసం ఓ కుర్రాడి రిస్కీ ఫీట్.. చివరకు జరిగిందో వీడియోలో మీరే చూడండి..!
ముందుగా IRCTC అధికారిక వెబ్‌సైట్ www.irctc.co.in ని సంప్రదించాలి. తర్వాత my account ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అందులో my transaction పై క్లిక్ చేయాలి. ఫైల్ TDR లోకి వెళ్లగానే టికెట్ బుక్ చేసుకున్న వారి పేరు కనిపిస్తుంది. అందులోకి వెళ్లగానే PNR నంబర్, రైల్ నంబర్, క్యాప్చాను నింపాలి. తర్వాత రద్దు నిబంధనలతో కూడిన ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అందులో ఉన్న సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయాలి. తర్వాత PNR నంబర్‌ను పూరించాలి. అనంతరం టిక్కెట్‌ను రద్దు చేసుకునే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అనంతరం మీకు ఎంత డబ్బు వాపస్ వస్తుందో చూపిస్తుంది. చివరగా బుకింగ్ ఫారమ్‌లో ఇచ్చిన నంబర్‌కు నిర్ధారణ సందేశం వస్తుంది.