వరుసకు సోదరిపై ఓ యువకుడు అత్యాచారం.. బెదిరించి భయపెట్టి రెండేళ్లుగా నీచం.. కోర్టు తుది తీర్పులో రూ.12 వేల జరిమానాతోపాటు..

ABN , First Publish Date - 2022-07-19T23:43:42+05:30 IST

మహిళలపై దాడులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. కొందరు మృగాళ్లు కనీసం వయసు, వరసలు చూసుకోకుండా బరితెగిస్తున్నారు. ఇటీవల ఇలాంటి దారుణాలు తరచూ ఎక్కడో చోట జరుగుతూనే ఉన్నాయి. రాజస్థాన్‌లో ఇటీవల ఇలాంటి దారుణమే జరిగింది..

వరుసకు సోదరిపై ఓ యువకుడు అత్యాచారం.. బెదిరించి భయపెట్టి రెండేళ్లుగా నీచం.. కోర్టు తుది తీర్పులో రూ.12 వేల జరిమానాతోపాటు..

మహిళలపై దాడులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. కొందరు మృగాళ్లు కనీసం వయసు, వరసలు చూసుకోకుండా బరితెగిస్తున్నారు. ఇటీవల ఇలాంటి దారుణాలు తరచూ ఎక్కడో చోట జరుగుతూనే ఉన్నాయి. రాజస్థాన్‌లో ఇటీవల ఇలాంటి దారుణమే జరిగింది. ఓ ప్రబుద్ధుడు వరసకు సోదరి అయ్యే బాలికపై అత్చాచారానికి పాల్పడ్డాడు. బెదిరించి మరీ రెండేళ్లుగా దారుణానికి ఒడిగడుతున్నాడు. ఈ కేసులో కోర్టు సంచలన తీర్చు ఇచ్చింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..


రాజస్థాన్ రాష్ట్రం హనుమాన్‌ఘర్‌ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. సత్వీందర్ అనే యువకుడు వరసకు సోదరి అయ్యే బాలికపై కన్నేశాడు. 2017 మార్చిలో దారుణానికి పాల్పడ్డాడు. బాలిక ఒంటరిగా ఉండగా.. ఇంట్లోకి ప్రవేశించాడు. బలవంతంగా నోరు మూసి, అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ సమయంలో ఫొటోలు, వీడియోలు తీశాడు. బయట ఎవరికైనా చెబితే వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తానని బెదిరించాడు. ఈ సాకు చూపించి రెండేళ్లుగా ఆమెపై అఘాయిత్యానికి పాల్పడుతూ ఉన్నాడు.

బైక్‌పై వెళ్తుండగా సడన్‌గా రోడ్డు మీదకు వచ్చిన ఆవు.. దాన్ని తప్పించడానికి ప్రయత్నించాడు కానీ.. చివరకు..


రోజురోజుకూ వేధింపులు ఎక్కువవడంతో 2019లో బాధితురాలు మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసును విచారించిన న్యాయస్థానం ఆదివారం సంచలన తీర్చు ఇచ్చింది. యువకుడిని దోషిగా నిర్ధారిస్తూ.. రూ.12,000ల జరిమానాతో పాటూ పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

మేం ప్రేమించుకున్నాం.. అని ఆ జంట ముందే చెప్పినా బలవంతంగా ఆ యువతికి వేరే పెళ్లి.. చివరకు పరిస్థితి ఇదీ..!Updated Date - 2022-07-19T23:43:42+05:30 IST