క్రిస్మస్ రాత్రి వేళ ఈ పనులు చేస్తే... జీవితాంతం సంతోషమేనట!

ABN , First Publish Date - 2022-12-24T08:51:47+05:30 IST

డిసెంబరు 25న క్రిస్మస్ పర్వదినాన్ని జరుపుకుంటారు. క్రిస్మస్ రాత్రి వేళ కొన్ని ప్రత్యేకమైన పనులు చేయడం ద్వారా క్రైస్తవులు ఉత్తమ ఫలాలను అందుకుంటారని చెబుతారు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

క్రిస్మస్ రాత్రి వేళ ఈ పనులు చేస్తే... జీవితాంతం సంతోషమేనట!

డిసెంబరు 25న క్రిస్మస్ పర్వదినాన్ని జరుపుకుంటారు. క్రిస్మస్ రాత్రి వేళ కొన్ని ప్రత్యేకమైన పనులు చేయడం ద్వారా క్రైస్తవులు ఉత్తమ ఫలాలను అందుకుంటారని చెబుతారు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. క్రైస్తవ గ్రంథాలలో పేర్కొన్న వివరాల ప్రకారం రహస్య దానం గొప్ప దానంగా పరిగణిస్తారు. ఏసు ప్రభువు జన్మదినాన్ని ప్రతి సంవత్సరం క్రిస్మస్ పేరుతో జరుపుకుంటారు. ఆ రోజున రహస్య దానం చేయడం ద్వారా, జీవితంలోని అన్ని దుఃఖాలు పోయి, జీవితం ఆనందంతో నిండి ఉంటుందంటారు. ఇలా దానాలు చేసే వ్యక్తి ఆర్థిక ప్రయోజనాలను పొందుతాడని చెబుతారు. క్రిస్మస్ ఆనందాలను పంచుకునే పండుగ.

అందుకే క్రైస్తవులు.. నిరుపేదలకు, పేద పిల్లలకు రాత్రిపూట మిఠాయిలు, బొమ్మలు, బట్టలు బహుమతులుగా పంపిణీ చేస్తుంటారు. నిరుపేదలకు సహాయం చేయడమంటే భగవంతుడిని ఆరాధించినంత ఫలాన్ని ఇస్తుందని యేసు ప్రభువు చెప్పేవారు. క్రిస్మస్ చెట్టు చాలా ముఖ్యమైనదిగా క్రైస్తవులు పరగణిస్తారు. ఈ పండుగ నాడు ఇంట్లో క్రిస్మస్ చెట్టును పెట్టడం వల్ల కుటుంబంలో ప్రేమాభిమానాలు పెరుగుతాయి. ప్రతికూల శక్తి దూరమవుతుంది. క్రిస్మస్ రాత్రి పేదలకు ఆహారం అందించడం ద్వారా భగవంతుని ఆశీస్సులు లభిస్తాయని చెబుతారు. ఇలాచేస్తే బాధల నుండి ఉపశమనం లభిస్తుందంటారు. మానసిక ఒత్తిడి దూరమవుతుందని కూడా చెబుతారు. ఇంట్లో లేత నారింజ రంగు కొవ్వొత్తులు వెలిగించడం శుభసూచికగా భావిస్తారు. క్రిస్మస్ ట్రీకి ఎరుపు రంగు రిబ్బన్‌లో మూడు నాణేలు కట్టి వేలాడదీస్తే ఇంట్లో డబ్బుకు లోటు ఉండదని చెబుతుంటారు.

Updated Date - 2022-12-24T08:52:13+05:30 IST