ఈ సమోసాను 30 నిమిషాల్లో తినే దమ్ము మీకుంటే... రూ.51వేలు మీ సొంతం!
ABN , First Publish Date - 2022-07-08T17:08:21+05:30 IST
ఆహార ప్రియులకు ఓ వ్యాపారీ ఛాలెంజ్ విసిరాడు. తాను తయారు చేసే సమోసాను తింటే.. రూ.51వేలు గెలుచుకోవచ్చంటూ బంపర్ ఆఫర్ కూడా ఇచ్చాడు. ఆఫర్ టెంప్ట్ చేస్తున్నా.. ఆ సమోసా ఎలా ఉంటుందో అని భయపడుతున్నారా
ఇంటర్నెట్ డెస్క్: ఆహార ప్రియులకు ఓ వ్యాపారీ ఛాలెంజ్ విసిరాడు. తాను తయారు చేసే సమోసాను తింటే.. రూ.51వేలు గెలుచుకోవచ్చంటూ బంపర్ ఆఫర్ కూడా ఇచ్చాడు. ఆఫర్ టెంప్ట్ చేస్తున్నా.. ఆ సమోసా ఎలా ఉంటుందో అని భయపడుతున్నారా? అలాంటి భయాలు ఏమీ పెట్టుకోవదన్ని కూడా సదరు వ్యాపారీ భరోసా ఇస్తున్నాడు. టేస్ట్‌లో క్వాలిటీలో ఎక్కడా రాజీ పడకుండా సమోసాను తయారు చేసి ఇస్తామని చెబుతున్నాడు. మరి అయితే.. అతడు ఈ ఛాలెంజ్‌ను ఎందుకు విసిరినట్టు అని అనుకుంటున్నారా? ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. అదేంటనే పూర్తి వివరాల్లోకి వెళితే..
శుభమ్ కౌశల్ అనే వ్యక్తి.. గత కొన్నేళ్లుగా ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో కౌశల్ స్వీట్స్ షాపును నడుపుతున్నాడు. ఈయనే ఫుడ్ లవర్స్‌కు సవాలు విసిరాడు. తాను తయారు చేసే బాహుపలి సమోసాను తినే దమ్ముందా అని ప్రశ్నిస్తున్నాడు. 8 కేజీల భారీ సమోను కేవలం 30 నిమిషాల్లో తినగలిగితే.. 51వేలు సొంతం చేసుకోవచ్చని ఆఫర్ ప్రకటించాడు. ఈ ఆఫర్ స్థానికంగా హాట్ టాపిక్ అయింది. ఈ నేపథ్యంలో కౌశల్ మాట్లాడారు. బాహుబలి సమోసాను తయారు చేయడానికి దాదాపు గంటన్నర సమయం పడుతుందని.. రూ.1100ఖర్చు అవుతుందని చెప్పాడు. గతంలో 4 కేజీల సమోసాను తయారు చేసినట్టు వెల్లడించాడు. 10 కేజీల సమోను కూడా తయారు చేసే ఆలోచనలో ఉన్నట్టు పేర్కొన్నాడు. కాగా.. తాను తయారు చేసే సమోసాలో బంగాల దుంపలు, డ్రై ఫ్రూట్స్, బఠాణీని ఉపయోగిస్తున్నట్టు వెల్లడించాడు.