స్కూటీ సీట్‌ను ఇలా కూడా వాడొచ్చని ఈ వీడియో చూసేంత వరకూ ఎవరికీ తెలియదేమో!

ABN , First Publish Date - 2022-06-04T20:25:01+05:30 IST

హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తకి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. అది చూసి నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. ‘అరెరే.. స్కూటీ సీటును ఇలా కూడా వాడొచ్చా’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా.. ఇంతకూ హైద

స్కూటీ సీట్‌ను ఇలా కూడా వాడొచ్చని ఈ వీడియో చూసేంత వరకూ ఎవరికీ తెలియదేమో!

ఇంటర్నెట్ డెస్క్: హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తకి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. అది చూసి నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. ‘అరెరే.. స్కూటీ సీటును ఇలా కూడా వాడొచ్చా’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా.. ఇంతకూ హైదరాబాదీ స్కూటీ సీటుపై ఏం ప్రయోగం చేశాడు అనే పూర్తి వివరాల్లోకి వెళితే..సాధారణంగా అందరూ స్కూటీ సీటును దేని కోసం ఉపయోగిస్తారు? అని అడిగితే.. ఈ మాత్రం తెలియదా.. కూర్చోవడానికి తప్ప స్కూటీ సీటు ఇంకెందుకు వాడతారు అంటూ ఠక్కున సమాధానం చెబుతారు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ యువకుడు ఈ అభిప్రాయాన్ని తప్పని నిరూపించాడు. వంటకాలు చేయడానికి కూడా స్కూటీ సీటును వాడుకోవచ్చని స్పష్టం చేశాడు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఇదే నిజం. వేసవి కావడంతో భానుడి భగభగలు హైదరాబాద్‌లో కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే సుమారు 40 సెంటీగ్రేడ్‌ల ఎండలో యువకుడు.. తన స్కూటీ సీటుపై చక్కగా దోశ తయారు చేశాడు. ఆ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో అదికాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోపట్ల స్పందిస్తున్న నెటిజన్లు.. ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు. ‘ఆయిల్ వేయడం మర్చిపోయారు బ్రదర్’ అని కొందరు కామెంట్ చేస్తుంటే.. మరికొందరేమో.. ‘నాన్‌స్టిక్ తవా కంటే స్కూటీ సీటే బెటర్‌లా ఉందే!’ అని అభిప్రాయపడుతున్నారు. 
Updated Date - 2022-06-04T20:25:01+05:30 IST