Hyderabad Book Fair : పాటతోనే ఉద్యమాలు నడిచాయి.. పాటతోనే సమాజం ఉర్రూతలూగింది..!

ABN , First Publish Date - 2022-12-30T23:54:16+05:30 IST

పాటలేకుండా మనుషుల మధ్య అనుబంధం ఏర్పడదు.

 Hyderabad Book Fair : పాటతోనే ఉద్యమాలు నడిచాయి.. పాటతోనే సమాజం ఉర్రూతలూగింది..!
Hyderabad Book Fair

ఈరోజున బుక్ ఫెయిర్ అలిశెట్టి ప్రభాకర్ వేదిక పై పాట-మానవ సంబంధాలపై ప్రభావం, ప్రాముఖ్యతపై చర్చ జరిగింది. ఈకార్యక్రమంలో ముఖ్యఅతిధి గా కవి, గాయకుడు ఎమ్మెల్సీ గొరేటి వెంకన్న, గౌరవ అతిధి అల్లం నారాయణ, విశిష్ట అతిధి  జూలూరు గౌరీ శంకర్ పాల్గొన్నారు.

 

గాయకుడు, మిట్టపల్లి సురేందర్ మాట్లాడుతూ...పాట ప్రజలను చైతన్యం చేస్తుందని, ఒక ప్రభుత్వన్ని నిట్టనిలువుగా చీల్చింది పాటేనని అన్నారు. పాటతోనే పాలక వర్గాలను హెచ్చరికచేస్తుంది. పాటే తెలంగాణ సమాజాన్ని ఉర్రూతలూగించింది. పాటతో-మానవ సంబంధాలు ఉత్తేజితం చేసిందని తెలిపారు. ఈ సందర్భంగా పల్లేకన్నీరు పెడుతోందో...అని పాట పాడి వినిపించారు.

 

అల్లంనారాయణ మాట్లాడుతూ...పాట నక్సల్బరీ ఉద్యమాన్ని నడిపించింది. తెలంగాణ ఉద్యమాన్ని నడిపించింది. ఉద్యమాలను పుట్టించేదే పాట అన్నారు. పాటలేకుండా మనుషుల మధ్య అనుబంధం ఏర్పడదు. శ్రమ, అమర్వం మీద అనేక పాటలు మనలను ప్రభావితం చేస్తున్నాయి అని ఈ సందర్భంగా తన అభిప్రాయాన్ని తెలిపారు.

 

 కవి,గాయకుడు ఎమ్మెల్సీ  గొరేటి వెంకన్న మాట్లాడుతూ...మునుషుల జీవితమే పాటన్నారు. పాటలేకుంటే తానులేనన్నారు. పాట మానవ సంబంధాలను మరింత దగ్గర చేస్తుందని చెప్పారు. కార్యక్రమంలో అభినయ శ్రీనివాస్, కోదారి శ్రీనివాస, గిద్దె రామ నరసయ్య, దయా నర్సింగ్, బోడ చంద్ర ప్రకాష్ పాల్గొన్నారు.

Updated Date - 2022-12-30T23:54:19+05:30 IST