‘‘మా ఫ్రెండ్స్ ఇంట్లో ఫంక్షన్ ఉంది వెళ్దాం పదా’’.. అంటూ ప్రియురాలిని తీసుకెళ్లాడు.. వెళ్లిన కొద్ది సేపటి తర్వాత చూస్తే సీన్ రివర్స్..

ABN , First Publish Date - 2022-03-13T00:46:20+05:30 IST

ప్రియురాలిని గాఢంగా ప్రేమించి, పెళ్లి తర్వాత కూడా అంతే ప్రేమతో చూసుకునే యువకులు ఎంతో మంది ఉన్నారు. అలాగే ప్రేమ పేరుతో యువతులను నమ్మించి, చివరికి ..

‘‘మా ఫ్రెండ్స్ ఇంట్లో ఫంక్షన్ ఉంది వెళ్దాం పదా’’.. అంటూ ప్రియురాలిని తీసుకెళ్లాడు.. వెళ్లిన కొద్ది సేపటి తర్వాత చూస్తే సీన్ రివర్స్..
ప్రతీకాత్మక చిత్రం

ప్రియురాలిని గాఢంగా ప్రేమించి, పెళ్లి తర్వాత కూడా అంతే ప్రేమతో చూసుకునే యువకులు ఎంతో మంది ఉన్నారు. అలాగే ప్రేమ పేరుతో యువతులను నమ్మించి, చివరికి మోసం చేసేవాళ్లు కూడా కొందరుంటారు. మాయ మాటలు నమ్మి వచ్చిన బాలికలు, యువతులపై అత్యాచారాలు, హత్యలకు పాల్పడడం తరచూ చూస్తూనే ఉన్నాం. ఒడిశా రాష్ట్రంలో ఒక యువతిని ఓ వ్యక్తి ఇలాగే మాయమాటలతో నమ్మించాడు. కొంతకాలంగా ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. ఓ రోజు ‘‘మా ఫ్రెండ్స్ ఇంట్లో ఫంక్షన్ ఉంది.. వెళ్దాం పదా’’.. అంటూ తీసుకెళ్లాడు. తీరా అక్కడికి వెళ్లిన కొద్దిసేపటికి సీన్ భయానకంగా మారిపోయింది. వివరాల్లోకి వెళితే..


ఒడిశా రాష్ట్రం మల్కన్‌గిరి సమితి పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. పూరణగుడ అనే ప్రాంతానికి చెందిన గుప్త బారల్ అనే యువకుడికి, ఓ యువతికి కొంత కాలం క్రితం పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో మాయమాటలు చెప్పి ఆమెను బాగా నమ్మించాడు. అతడి మాటలను పూర్తిగా నమ్మిన ఆమె.. ప్రేమించడం మొదలెట్టింది. ఇద్దరూ కలిసి చెట్టాపట్టాలేసుకుంటూ తిరిగేవారు. అంతవరకూ అతడిలో మంచి ప్రేమికుడు మాత్రమే ఉండేవాడు. ఈ క్రమంలో గురువారం తన ప్రియురాలిని పిలిచి..  ‘‘మా ఫ్రెండ్స్ ఇంట్లో ఫంక్షన్ ఉంది వెళ్దాం పదా’’.. అని చెప్పాడు. అప్పటికే ప్రియుడిపై ఎంతో నమ్మకంతో ఉన్న ఆమె.. పిలిచిన వెంటనే కాదనకుండా వెళ్లింది. అక్కడికి వెళ్లగానే లోపల కొందరు స్నేహితులు సిద్ధంగా ఉన్నారు. అయితే అక్కడ పంక్షన్ జరుగుతున్న హడావుడి కనిపించకపోవడంతో యువతికి మొదట అనుమానం కలిగింది. ‘‘ఏంటీ! బంధువులు ఎవరూ లేరు, ఏం పంక్షన్ చేస్తున్నారు మీరు’’.. అని అడిగింది. ఇలా మాట్లాడుతుండగానే ఆమెను బలవంతంగా ఓ గదిలోకి లాక్కెళ్లారు.

ఆ కంపెనీలో జాబ్ చేయాలంటే చోరీలు చేయడంలో అనుభవం ఉండాలి.. ఇంతకీ ఆ పని, జీతం ఎలా ఉంటుందంటే..


అనంతరం ప్రియుడితో పాటూ అతడి స్నేహితులు కూడా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ప్రియుడి మాటలు నమ్మి వస్తే.. ఊహించని విధంగా ఇలా జరగడంతో ఆమె తీవ్ర మనస్థాపానికి గురైంది. ఏడుస్తూ అక్కడే విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో భయపడిపోయిన ప్రియుడు.. ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించాడు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం మరో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు.. కుమార్తె మృతదేహంపై పడి బోరున విలపించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని యువతి తల్లిదండ్రులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

నీ ప్రవర్తన బాగోలేదన్న భర్త.. అయితే విడాకులు తీసుకోమన్న భార్య.. చివరకు ఏం జరిగిందంటే..

Updated Date - 2022-03-13T00:46:20+05:30 IST