ఇద్దరు కూతుళ్లను కన్నావ్.. వారసుడిని ఇవ్వలేకపోయావ్.. అంటూ ఓ భర్త చేసిన నిర్వాకమిది.. 15 ఏళ్ల క్రితమే పెళ్లయినా..

ABN , First Publish Date - 2022-06-01T22:21:22+05:30 IST

ఆమెకు 15 ఏళ్ల క్రితం వివాహం అయింది.. ఏడేళ్ల వరకు ఆమెకు పిల్లలు లేరు.. దీంతో భర్త ఆమెను ఓ టెస్ట్‌ట్యూబ్ బేబీ సెంటర్‌కు తీసుకెళ్లాడు..

ఇద్దరు కూతుళ్లను కన్నావ్.. వారసుడిని ఇవ్వలేకపోయావ్.. అంటూ ఓ భర్త చేసిన నిర్వాకమిది.. 15 ఏళ్ల క్రితమే పెళ్లయినా..

ఆమెకు 15 ఏళ్ల క్రితం వివాహం అయింది.. ఏడేళ్ల వరకు ఆమెకు పిల్లలు లేరు.. దీంతో భర్త ఆమెను ఓ టెస్ట్‌ట్యూబ్ బేబీ సెంటర్‌కు తీసుకెళ్లాడు.. అక్కడ చికిత్స అనంతరం ఆమె ఓ అడపిల్లకు జన్మనిచ్చింది.. దీంతో భర్త తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.. అంత ఖర్చు పెడితే ఆడపిల్లను కన్నావ్ అంటూ భార్యపై విరుచుకుపడ్డాడు.. రెండోసారి ప్రయత్నిద్దామని భార్య నచ్చచెప్పడంతో శాంతించాడు.. రెండేళ్ల తర్వాత ఆమె మరోసారి గర్భవతి అయింది.. అయితే అప్పుడు కూడా ఆమెకు ఆడపిల్లే పుట్టింది.. దాంతో అతను భార్యను హింసించడం ప్రారంభించాడు.. కొన్ని రోజుల క్రితం భార్య, పిల్లలను వదిలేసి పరారయ్యాడు. 


ఇది కూడా చదవండి..

పనికి వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చిన తల్లి.. రెండేళ్ల కొడుక్కి విపరీతంగా నొప్పి.. ఆస్పత్రికి తీసుకెళ్లాక అసలు నిజం తెలిసి..


మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందిన హరికిషన్ మౌర్యతో దేవికకు 15 ఏళ్ల క్రితం వివాహమైంది. అయితే, పెళ్లయ్యాక చాలా రోజుల వరకు ఆమెకు పిల్లలు పుట్టలేదు. ఆమెను భర్త చాలా మంది వైద్యులకు చూపించాడు. టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌కు తీసుకు వెళ్లమని ఓ డాక్టర్ సలహా ఇచ్చారు. దీంతో హరికిషన్ ఒక బంధువు వద్ద రూ.25 వేలు అప్పు తీసుకుని భార్యను టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌కు తీసుకెళ్లి చికిత్స చేయించాడు. చికిత్స అనంతరం ఆమె గర్భవతి అయింది. అయితే, ఆమెకు ఆడపిల్ల పుట్టింది. కూతురు పుట్టగానే భర్తకు కోపం వచ్చింది. భార్యను ఇంటి నుంచి బయటకు వెళ్లిపొమ్మన్నాడు. 


రెండోసారి మగ బిడ్డ పుట్టే అవకాశం ఉందని భర్తకు దేవిక నచ్చచెప్పింది. రెండేళ్ల తర్వాత టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ సహాయంతో మరోసారి గర్భం దాల్చింది. రెండో సారి కూడా ఆమెకు ఆడబిడ్డే పుట్టింది. అప్పట్నుంచి వారి బంధం పూర్తిగా చెడిపోయింది. ఆడ పిల్లల బాధ్యత తీసుకోవడానికి హరికిషన్ నిరాకరించాడు. ఉద్యోగ పని నిమిత్తం ముంబై వెళ్తున్నానని చెప్పి రెండు నెలల క్రితం వెళ్లాడు. ఎంతకీ తిరిగి రాకపోవడంతో మే 19న దేవిక ఏఎస్పీ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేసింది. మే 24న పోలీసులు షాకింగ్ వార్త చెప్పారు. రేణు అనే మహిళతో కలిసి హరికిషన్ పారిపోయాడని చెప్పారు. ప్రస్తుతం హరికిషన్ కోసం పోలీసులు వెతుకుతున్నారు.

Updated Date - 2022-06-01T22:21:22+05:30 IST