కొత్త కోడలిని ఇంట్లోనే ఉంచి మార్కెట్‌కు వెళ్లిన అత్త, మరిది.. తిరిగి వచ్చేసరికి గదిలో కనిపించిన దృశ్యం చూసి..
ABN , First Publish Date - 2022-06-10T21:51:55+05:30 IST
అతనికి నాలుగు నెలల క్రితం వివాహమైంది.. భార్య, తల్లి, సోదరుడితో కలిసి నివసిస్తున్నాడు..

అతనికి నాలుగు నెలల క్రితం వివాహమైంది.. భార్య, తల్లి, సోదరుడితో కలిసి నివసిస్తున్నాడు.. గురువారం ఉదయం అతను తన వ్యాపారం నిమిత్తం బయటకు వెళ్లిపోయాడు.. కొత్త కోడలిని ఇంట్లో ఉంచి అత్త, మరిది మార్కెట్‌కు వెళ్లారు.. వారు సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చి లోపలి దృశ్యం చూసి షాకైపోయారు.. కోడలి మృతదేహం నేలపై పడి ఉండగా, కొడుకు ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు.. దీంతో వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు.
ఇది కూడా చదవండి.
పగవాడికి కూడా రాకూడని కష్టమిది.. 4 ఏళ్ల కూతురి శవాన్ని భుజాన వేసుకుని మండుటెండలో 5 కిలోమీటర్లు నడిచిన తండ్రి..
మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్‌కు చెందిన విభర్ సాహు అనే వ్యక్తి నాలుగు నెలల క్రితం 23 ఏళ్ల రితూ అనే యువతిని వివాహం చేసుకున్నాడు. విభర్ జబల్పూర్ మార్కెట్‌లో కూరగాయలు అమ్ముతుంటాడు. తన భార్య, తల్లి, సోదరుడితో కలిసి నివసిస్తున్నాడు. నెల రోజుల క్రితం భార్యతో కలిసి విభర్ నాగపూర్ వెళ్లాడు. తిరిగి వచ్చిన తర్వాత భార్యభర్తలిద్దరూ గొడవ పడ్డారు. అప్పట్నుంచి ఇద్దరూ సరిగ్గా మాట్లాడుకునే వారు కాదు. బుధవారం ఉదయం విభర్ విభర్ తల్లి, సోదరుడు మార్కెట్‌కు వెళ్లారు. సాయంత్రం వారు తిరిగి వచ్చే సమయానికి విభర్, రీతూ విగత జీవులుగా మారిపోయారు.
రీతూ గొంతుపై కత్తెర దిగి రక్తపు మడుగులో పడి ఉంది. విభర్ మృతదేహం ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. భార్యను హత్య చేసిన తర్వాత విభర్ ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. వారి మృతదేహాలకు పోస్ట్‌మార్టమ్ నిర్వహించారు. కాగా, వారి మధ్య గొడవకు గల కారణాలు బయటకు రాలేదు.