-
-
Home » Prathyekam » husband had taken the wife to visit Mumbai with children but wife escaped with her lover prvn spl-MRGS-Prathyekam
-
Viral News: ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. కానీ ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత భార్య ఇలా చేస్తుందని అస్సలు ఊహించలేకపోయాడు
ABN , First Publish Date - 2022-08-31T17:48:28+05:30 IST
ఆమెను చూసి అతడు మనసు పడ్డాడు. తర్వాత నేరుగా వెళ్లి ఆమెకు తన ప్రేమను వ్యక్త పరిచాడు. ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. ఎగిరి గంతేశాడు. అనంతరం పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత తన భార్యతో కలిసి స

ఇంటర్నెట్ డెస్క్: ఆమెను చూసి అతడు మనసు పడ్డాడు. తర్వాత నేరుగా వెళ్లి ఆమెకు తన ప్రేమను వ్యక్త పరిచాడు. ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. ఎగిరి గంతేశాడు. అనంతరం పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత తన భార్యతో కలిసి సరదాగా గడిపేందుకు ముంబై వెళ్లాడు. అక్కడ అతడికి తన భార్య షాకిచ్చింది. దీంతో భార్య, పిల్లల ఫొటోలతో రోడ్డుపై పిచ్చోడిలా తిరుగుతున్నాడు. కాగా.. ఇంతకూ ఏం జరిగిందనే పూర్తి వివరాల్లోకి వెళితే..
బిహార్(Bihar)లోని గోపాల్గంజ్ ప్రాంతానికి నంద్జి గిరి అనే వ్యక్తి మమతా దేవి అనే మహిళను చూసి ఇష్టపడ్డాడు. విషయాన్ని ఆమెకి చెప్పి, అంగీకారంతో ఎనిమిదేళ్ల క్రితం వివాహం(Love Marriage) చేసుకున్నాడు. ఈ క్రమంలోనే ఆ దంపతులు ఓ పాప, బాబుకు జన్మనిచ్చారు. ప్రస్తుతం పాపకు ఆరేళ్ల వయసు ఉండగా.. బాబుకు 5ఏళ్లు. తాజాగా కుటుంబ సభ్యులతో టూర్ ప్లాన్ చేసిన గిరి.. భార్యపిల్లలతో సహా ముంబైకి చేరుకున్నాడు. ఈ క్రమంలోనే పిల్లలతో సహా భార్య అకస్మాత్తుగా కనిపించకుండాపోయింది. దీంతో కంగారుపడ్డ అతడు.. పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మమతా దేవి తన ప్రియుడితో కలిసి పారిపోయనట్టుగా అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. విషయం తెలిసి షాకైన గిరి.. భార్య పిల్లల ఫొటోలు పట్టుకుని ముంబై వీధుల వెంట తిరుగుతున్నాడు. తన భార్య తిరిగొస్తే ప్రేమగా చూసుకుంటానని చెబుతున్నాడు. ప్రస్తుతం అతడికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియా(Social Meida)లో వైరల్(Viral News)గా మారాయి.