ప్రేమ వివాహం చేసుకున్న యువకుడు.. తన భార్యను ఆమె తల్లిదండ్రులే చంపారని పోలీసులకు ఫిర్యాదు.. నిజానికి ఆమె ఎలా చనిపోయిందంటే..

ABN , First Publish Date - 2022-04-25T07:52:32+05:30 IST

ప్రేమించి పెళ్లిచేసుకున్న తన భార్యను ఆమె తండ్రి, అక్క హత్య చేశారని భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కానీ పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. అతని భార్య నిజానికి ఎవరు చంపారో పోలీసులు చాలా చక్యంగా...

ప్రేమ వివాహం చేసుకున్న యువకుడు.. తన భార్యను ఆమె తల్లిదండ్రులే చంపారని పోలీసులకు ఫిర్యాదు.. నిజానికి ఆమె ఎలా చనిపోయిందంటే..

ప్రేమించి పెళ్లిచేసుకున్న తన భార్యను ఆమె తండ్రి, అక్క హత్య చేశారని భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కానీ పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. అతని భార్య నిజానికి ఎవరు చంపారో పోలీసులు చాలా చక్యంగా తెలుసుకున్నారు. ఈ ఘటన రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో వెలుగు చూసింది. 


స్థానికంగా నివశించే సల్మాన్ అనే యువకుడు ఐదేళ్ల క్రితం రవీనా అనే యువతిని ప్రేమించి రెండో పెళ్లి చేసుకున్నాడు. వారిద్దరికీ ఒక కొడుకు పుట్టాడు. అయితే కొంత కాలం తర్వాత ఇద్దరి మధ్య గొడవలు జరగడంతో రవీనా అతడిని వదిలేసి వెళ్లి.. తన తల్లి, అక్కతో కలిసి ఉంటోంది.


ఈ క్రమంలో తాజాగా ఆమె ఇంటికి వెళ్లిన సల్మాన్.. రవీనాతో ఏదో విషయంలో గొడవ పడ్డాడు. ఆ వివాదం పెద్దది కావడంతో రవీనా మెడలో ఉన్న చున్నీతోనే ఆమె గొంతు పిసికి చంపేశాడు. ఈ విషయాన్ని దాచిపెట్టేందుకు ఏడాదిన్నర వయసున్న రుహాన్‌ను తీసుకొని పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. అక్కడ కూర్చొని ఏడుస్తూ రవీనా తండ్రి, ఆమె సోదరి అలియాపై హత్యారోపణలు చేశాడు. 


విషయం తెలిసి ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు అక్కడ గొడవ జరిగిన ఆనవాళ్లు కనిపించాయి. సల్మాన్ కేసు పెట్టడంతో రవీనా తండ్రి, సోదరి ఎక్కడ ఉన్నారా? అని వెతగ్గా వాళ్లు తమ సొంతూళ్లో కనిపించారు. దర్యాప్తు సందర్భంగా పలుమార్లు సల్మాన్ తన వాంగ్మూలం మార్చడంతో పోలీసులకు మరింత అనుమానం పెరిగింది. చివరకు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. కేసుపై దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు చెప్పారు.

Updated Date - 2022-04-25T07:52:32+05:30 IST