తెల్లవారుజామున నిద్రలేచిన భార్య.. గదిలో కనిపించని భర్త.. పక్క గదిలోకి వెళ్లి చూస్తే కనిపించిన దృశ్యం చూసి..

ABN , First Publish Date - 2022-06-20T20:03:51+05:30 IST

ఎప్పటిలాగే ఆమె ఉదయాన్నే నిద్ర లేచింది. గదిలో భర్త లేకపోవడంతో.. అప్పటికే లేచి బయటకు వెళ్లి ఉంటాడేమో అని భావించింది. అనంతరం ఇల్లు శుభ్రం చేస్తూ.. పక్క గదికి వెళ్లింది. ఆ తర్వాత అక్కడ కనిపించిన దృశ్యం చూసి షాకైంది. గట్టిగా కేకలు

తెల్లవారుజామున నిద్రలేచిన భార్య.. గదిలో కనిపించని భర్త.. పక్క గదిలోకి వెళ్లి చూస్తే కనిపించిన దృశ్యం చూసి..

ఇంటర్నెట్ డెస్క్: ఎప్పటిలాగే ఆమె ఉదయాన్నే నిద్ర లేచింది. గదిలో భర్త లేకపోవడంతో.. అప్పటికే లేచి బయటకు వెళ్లి ఉంటాడేమో అని భావించింది. అనంతరం ఇల్లు శుభ్రం చేస్తూ.. పక్క గదికి వెళ్లింది. ఆ తర్వాత అక్కడ కనిపించిన దృశ్యం చూసి షాకైంది. గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు పరుగెత్తుకొచ్చారు. ఆ తర్వాత ఏం జరిగిందనే పూర్తి వివరాల్లోకి వెళితే..ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ జిల్లాకు చెందిన సహాబ్ సింగ్ (32) అనే వ్యక్తికి సుమారు 7ఏళ్ల క్రితం సోనీ దేవీ అనే మహిళతో వివాహం జరిగింది. పెళ్లైన కొత్తలో ఈ దంపతులు ఇద్దరూ చాలా అనోన్యంగా ఉన్నారు. కానీ ఆ తర్వాత ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. ఆదివారం రాత్రి కూడా ఈ భార్యాభర్తలు సహాబ్ సింగ్ తండ్రి విషయంలో గొడవపడ్డారు. గొడవ సర్ధుమనిగిన తర్వాత భోజనం చేసి, గదిలోకి వెళ్లి పడుకున్నారు. అయితే తెల్లాసారికి ఊహించని ఘటన చోటు చేసుకోవడంతో సోనీ దేవీ షాకైంది. పక్క గదిలో సహాబ్ సింగ్ ఉరేసుకుని విగత జీవిగా వెలాడటం చూసి గట్టిగా కేకలు వేసింది. దీంతో స్థానికులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. ఈ ఘటనపై పోలీసులకు కూడా సమాచారం అందింది. వెంటనే అక్కడకు వెళ్లిన అధికారులు.. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. 


Updated Date - 2022-06-20T20:03:51+05:30 IST