ఆ విషయాన్ని భార్య దగ్గర దాచబోయి.. అధికారుల వద్ద అడ్డంగా బుక్కైన భర్త!

ABN , First Publish Date - 2022-07-10T17:33:40+05:30 IST

అతడికి అప్పటికే పెళ్లైంది. కానీ వక్రబుద్ధితో ఆలోచించాడు. పరాయి స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అంతేకాకుండా గాళ్‌ఫ్రెండ్‌తో ఎంజాయ్ చేయడానికి విదేశాలకు వెళ్లాడు. ఈ క్రమంలో భార్య దగ్గర ఆ విషయం బయటప

ఆ విషయాన్ని భార్య దగ్గర దాచబోయి.. అధికారుల వద్ద అడ్డంగా బుక్కైన భర్త!

ఇంటర్నెట్ డెస్క్: అతడికి అప్పటికే పెళ్లైంది. కానీ వక్రబుద్ధితో ఆలోచించాడు. పరాయి స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అంతేకాకుండా గాళ్‌ఫ్రెండ్‌తో ఎంజాయ్ చేయడానికి విదేశాలకు వెళ్లాడు. ఈ క్రమంలో భార్య దగ్గర ఆ విషయం బయటపడకుండా ఉండేందుకు ఓ పని చేసి.. అడ్డంగా బుక్కయ్యాడు. దీంతో అతడి వ్యవహారం ప్రస్తుతం హాట్ టాపిక్ అయింది. కాగా.. ఇంతకూ ఏం జరిగిందనే పూర్తి వివరాల్లోకి వెళితే..32ఏళ్ల ఓ వ్యక్తికి కొన్నేళ్ల క్రితమే ఓ మహిళతో వివాహం జరిగింది. అయినప్పటికీ అతడు.. మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ క్రమంలో ఆఫీస్ పని మీద విదేశాలకు వెళ్తున్నట్టు భార్యకు చెప్పి.. గాళ్‌ఫ్రెండ్‌ను కలిసేందుకు మల్దీవులకెళ్లాడు. అక్కడ ప్రియురాలితో ఎంజాయ్ చేసి.. తిరుగుపయనం అయ్యాడు. ముంబైకి చేరుకున్న తర్వాత ఇమ్మిగ్రేషన్ అధికారులు అతడికి షాకిచ్చారు. అతడి పాస్‌పోర్ట్‌లో కొన్ని పేపర్లు లేకపోవడంతో అధికారులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో విచారణ సందర్భంగా అతడి మాటలు విని అధికారులు అవాక్కయ్యారు. తనకు ఇదివరకే పెళ్లైందని.. ఆఫీస్ పని మీద విదేశాలకు వెళ్తున్నట్టు భార్యకు చెప్పి గాళ్‌ఫ్రెండ్ కోసం మల్దీవులకు వెళ్లాలని.. ఈ విషయం తన భార్యకు తెలియకుండా ఉండేందుకు పాస్‌పోర్ట్‌లోని పేపర్లను తానే చించినట్టు చెప్పడంతో అధికారులు విస్తుపోయారు. ట్రావెల్ హిస్టరీ తెలిపే పేపర్లను తొలగించడం నేరమనే విషయం తనకు తెలియదని వాపోయాడు. దీంతో అతడి వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశం అయింది. ఇదిలా ఉంటే.. అతడిపై అధికారులు చట్ట పరమైన చర్యలు తీసుకుంటున్నట్టు సమాచారం. 


Read more