36 రోజుల క్రితం పెళ్లి.. సిటీలో కొత్త కాపురం.. భార్యను ఇంట్లోనే ఉంచి సొంతూరికి వచ్చి భర్త ఆత్మహత్య.. అసలు ట్విస్ట్ ఏంటంటే..

ABN , First Publish Date - 2022-06-22T02:25:10+05:30 IST

ఆ యువకుడికి 36రోజుల క్రితమే వివాహమైంది. భార్యతో కలిసి సిటీలో కొత్తగా కాపురం పెట్టాడు. కూలి పనులు చేసుకుంటూ భార్యను పోషించేవాడు. ఇద్దరూ ఎంతో సంతోషంగా ఉండేవారు. అయితే...

36 రోజుల క్రితం పెళ్లి.. సిటీలో కొత్త కాపురం.. భార్యను ఇంట్లోనే ఉంచి సొంతూరికి వచ్చి భర్త ఆత్మహత్య.. అసలు ట్విస్ట్ ఏంటంటే..
గౌరవ్‌ (ఫైల్)

ఆ యువకుడికి 36రోజుల క్రితమే వివాహమైంది. భార్యతో కలిసి సిటీలో కొత్తగా కాపురం పెట్టాడు. కూలి పనులు చేసుకుంటూ భార్యను పోషించేవాడు. ఇద్దరూ ఎంతో సంతోషంగా ఉండేవారు. అయితే ఇటీవల భార్యను ఇంట్లోనే ఉంచి సొంతూరికి వచ్చాడు. ఏమైందో ఏమో తెలీదుగానీ బావిలో శవమై తేలాడు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే.. 


ఉత్తరప్రదేశ్‌లోని ఎటావా జిల్లా భర్తానా ప్రాంతంలోని గదలోత్ గ్రామానికి చెందిన గౌరవ్‌(22)కు మే 15న ఓ యువతితో వివాహమైంది. పెళ్లయిన కొద్ది రోజులకే భార్యను తీసుకుని, ఢిల్లీలో ఉంటున్న తన బావ వద్దకు వెళ్లాడు. అక్కడే గది అద్దెకు తీసుకుని, కూలి పనులు చేసుకుంటూ భార్యను పోషించేవాడు. అయితే గత ఆదివారం భార్యను ఢిల్లీలోనే ఉంచి, అర్జెంట్ పనుందంటూ సొంతూరికి వచ్చేశాడు. ఇంటి నుంచి సాయంత్రం వాకింగ్ వెళ్లిన వ్యక్తి రాత్రికి కూడా రాలేదు. దీంతో కంగారుపడిన గౌరవ్ తల్లి కుసుమదేవి, మామ కమలేష్, ఇతర కుటుంబ సభ్యులు.. అతడి కోసం వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలో అర్ధరాత్రి గ్రామానికి 100మీటర్ల దూరంలో ఉన్న బావి వద్ద గౌరవ్ చెప్పులు, దుస్తులు, ఫోన్ పడి ఉండడాన్ని గుర్తించారు.

ఒకే రోజు.. ఒకే కుటుంబానికి చెందిన 9 మంది మృతి.. తెల్లారినా ఆ ఇళ్లల్లో తలుపులు తీయకపోవడంతో స్థానికులు వెళ్లి చూస్తే..


సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకుని బావి నుంచి గౌరవ్ మృతదేహాన్ని బయటకు తీయించి, పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇదిలావుండగా, గౌరవ్ మృతి చెందిన గంటల వ్యవధిలో అతడి ఇంటికి సమీపంలో ఉంటున్న సాధన(19) అనే యువతి కూడా ఆత్మహత్య చేసుకుంది. ఈమెకు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వివాహం కావాల్సి ఉందని తెలిసింది. సాధన తండ్రి చనిపోవడంతో తల్లితో కలిసి అమ్మమ్మ ఇంట్లో ఉంటోంది. గౌరవ్, సాధన మధ్య ప్రేమ వ్యవహారం ఉందననే విషయం పోలీసుల విచారణలో తెలిసింది. వీరి మృతికి ప్రేమ వ్యవహారమే కారణమా.. లేక వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా.. అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. కాగా.. గౌరవ్, సాధన మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

నేను చనిపోయాకే నా విలువ మీకు తెలుస్తుందంటూ తల్లిదండ్రులకు మెసేజ్.. చనిపోయిన 21 ఏళ్ల యువకుడి మొబైల్‌లో..

Updated Date - 2022-06-22T02:25:10+05:30 IST