సైకో భర్త శాడిజం.. తొలి రేయి నుంచే నరకం.. హోటళ్లో స్నేహితులు, వారి భార్యలతో కలిసి..

ABN , First Publish Date - 2022-10-17T21:19:24+05:30 IST

వారిద్దరూ చిన్నప్పటి నుంచి స్నేహితులు.. కలిసే పెరిగారు.. ఈ ఏడాది జూన్‌లో పెద్దలు వారిద్దరికీ వివాహం జరిపించారు..

సైకో భర్త శాడిజం.. తొలి రేయి నుంచే నరకం.. హోటళ్లో స్నేహితులు, వారి భార్యలతో కలిసి..

వారిద్దరూ చిన్నప్పటి నుంచి స్నేహితులు.. కలిసే పెరిగారు.. ఈ ఏడాది జూన్‌లో పెద్దలు వారిద్దరికీ వివాహం జరిపించారు.. ఫస్ట్ నైట్ కోసం అంటూ తను పని చేస్తున్న ఫైవ్‌స్టార్ హోటల్‌కు భార్యను తీసుకెళ్లాడు.. అక్కడ ఆమెకు నరకం చూపించాడు.. ఆమె ఫోన్ లాక్కుని బంధించాడు.. వైఫ్ స్వాపింగ్ (ఒకరి భార్యతో మరొకరు శృంగారం సాగించడం) గేమ్‌లో పాల్గొనాలని ఒత్తిడి చేశాడు.. ఆమె అందుకు అంగీకరించకపోవడంతో చుక్కలు చూపించాడు.. చివరకు శాడిస్ట్ భర్త నుంచి తప్పించుకున్న ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని ఇంకా అరెస్ట్ చేయలేదు. 


ఇది కూడా చదవండి..

Google Manager: గూగుల్‌ ఉన్నతోద్యోగి కిడ్నాప్.. బలవంతంగా వివాహం జరిపించి ఆ తర్వాత ఏం చేశారంటే..


మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన ఓ యువతికి ఈ ఏడాది జూన్‌లో తన చిన్ననాటి స్నేహితుడితో వివాహమైంది. అతను బికనీర్‌లోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్లో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. వివాహం జరిగిన వెంటనే అతను తన భార్యను హోటల్‌కు తీసుకెళ్లాడు. అక్కడ ఆమె ఫోన్ లాక్కుని బంధించాడు. వైఫ్ స్వాపింగ్ గేమ్ ఆడాలని ఒత్తిడి చేశాడు. అందుకు ఆ యువతి నిరాకరించింది. దాంతో 15 రోజుల పాటు ఆమెను అదే గదిలో బంధించి దారుణంగా హింసించాడు. భార్యను మంచానికి కట్టేసి ఆమెతో అసహజ శృంగారంలో పాల్గొనేవాడు. అలాగే డ్రగ్స్ సేవించి ఆమె ఎదురుగానే వేరే మహిళలతోనూ, పురుషులతోనూ శృంగారం చేసేవాడు. 


ఆ తర్వాత భార్యను ఇంటికి తీసుకెళ్లి రూ.50 లక్షల అదనపు కట్నం కోసం డిమాండ్ చేశాడు. బాధిత యువతి తన పరిస్థితి గురించి మేనమామకు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. చివరకు స్వస్థలం చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసుకున్న పోలీసులు ఇప్పటివరకు నిందితుడిని అరెస్ట్ చేయలేదు. దీంతో బాధిత కుటుంబం ఆందోళనకు సిద్ధమవుతోంది. 

Updated Date - 2022-10-17T21:19:24+05:30 IST