ఈ భార్యభర్తలు మామూలోళ్లు కాదు.. వీళ్లకు ఎంత ధైర్యమంటే..

ABN , First Publish Date - 2022-09-08T20:14:20+05:30 IST

పైన ఫొటోలో పోలీసుల మధ్యలో అమాయకంగా కూర్చున్న ఈ భార్యభర్తలు మామూలోళ్లు కాదు. ఒడిశాకు చెందిన ఈ దంపతుల పేర్లు బాబూరామ్ ఖారా, లలితా ఖారా. అత్యంత ధైర్యంతో ఈ దంపతులు పోలీసుల కళ్లు కప్పబోయారు. కథ అడ్డం తిరగడంతో ప

ఈ భార్యభర్తలు మామూలోళ్లు కాదు.. వీళ్లకు ఎంత ధైర్యమంటే..

ఇంటర్నెట్ డెస్క్: పైన ఫొటోలో పోలీసుల మధ్యలో అమాయకంగా కూర్చున్న ఈ భార్యభర్తలు మామూలోళ్లు కాదు. ఒడిశాకు చెందిన ఈ దంపతుల పేర్లు బాబూరామ్ ఖారా, లలితా ఖారా. అత్యంత ధైర్యంతో ఈ దంపతులు పోలీసుల కళ్లు కప్పబోయారు. కథ అడ్డం తిరగడంతో పట్టుపడ్డారు. కాగా.. ఇంతకూ ఈ భార్యభర్తలు ఏం చేశారంటే..రెండు మూటలతో ఈ భార్యభర్తలు ఛత్తీస్‌గఢ్ మీదుగా మధ్యప్రదేశ్‌కు బయల్దేరారు. ఛత్తీస్‌గఢ్‌లోని Kawardha‌లో ఉన్న బస్టాండ్‌లో బస్ కోసం వేచి చూస్తున్న ఈ దంపతులను స్థానిక పోలీసులు తనిఖీ చేశారు. ఈ క్రమంలో ఈ దంపతుల వద్ద 54కేజీల గంజాయి బయటపడింది. దీంతో అధికారులు ఇద్దరినీ అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఈ సందర్భంగా వివరాలను వెల్లడించిన అధికారులు.. భార్యభర్తలు పెద్ద మొత్తంలో గంజాయి తరలిస్తున్నట్టు కచ్చితమైన సమాచారం రావడంతోనే బస్‌‌స్టాండ్‌లో తనిఖీలు చేపట్టినట్టు చెప్పారు. ఈ నేపథ్యంలో బాబూరామ్, లిలిత దంపతుల వద్ద గంజాయి దొరికినట్టు పేర్కొన్నారు. దీని విలువ రూ.3లక్షల వరకు ఉంటుందని తెలిపారు. ఈ దంపతులు ఇద్దరూ మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో గంజాయిని విక్రయించాలనే ఉద్దేశంతో ప్రయాణాన్ని ప్రారంభించినట్టు చెప్పారు. కేసు నమోదు చేసి.. మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు. 


Read more