మన శరీరంలోని రక్తాన్ని పీల్చే జలగపై చిటికెడు ఉప్పు వేయగానే అది ఎందుకు చనిపోతుంది? దీనికి కారణమేమిటో తెలిస్తే..

ABN , First Publish Date - 2022-01-08T14:43:35+05:30 IST

మీరు జలగలను ఎప్పుడో ఒకప్పుడు...

మన శరీరంలోని రక్తాన్ని పీల్చే జలగపై చిటికెడు ఉప్పు వేయగానే అది ఎందుకు చనిపోతుంది? దీనికి కారణమేమిటో తెలిస్తే..

మీరు జలగలను ఎప్పుడో ఒకప్పుడు చూసేవుంటారు. ఇది రక్తం పీల్చే పురుగు అనే విషయం తెలిసిందే. ఇది ఒక రకమైన మాంసాహార పురుగు. ఈ పురుగు మనుషులు లేదా ఇతర జంతువుల రక్తాన్ని పీల్చి జీవిస్తుంది. ఈ పురుగు మనిషి శరీరాన్ని అతుక్కుని రక్తాన్ని పీలుస్తుంది. జలగలను చంపేందుకు ఉప్పును వినియోగిస్తారు. మరి ఉప్పు పడగానే జలగ ఎందుకు చనిపోతుందో మీకు తెలుసా? రక్తాన్ని పీల్చే ఈ జలగ శాస్త్రీయ నామం హిరుడో మెడిసినల్లిస్. ఇది తడి ప్రదేశాలలో కనిపించే పురుగు. మనిషి శరీరంలోని రక్తాన్ని ఈ జలగ పీలుస్తున్నప్పుడు.. దానిపై ఉప్పు వేయడం ద్వారా అది చనిపోతుంది. ఉప్పులోని రసాయన గుణమే దీని వెనుకగల కారణం.


నిజానికి జలగ చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. సాధారణంగా ఉప్పు.. నీటిని గ్రహిస్తుంది. ఈ కారణంగానే  ద్రవాభిసరణ పీడనం సహాయంతో ఉప్పు.. జలగ శరీరంలోని మొత్తం నీటినంతటికీ గ్రహిస్తుస్తుంది. ఫలితంగా జలగ శరీరంలో నీటి కొరత ఏర్పడటంతో దాని శరీరంలోని కణాలు పనిచేయడం మానేస్తాయి. ఫలితంగా జలగ చనిపోతుంది. జలగ.. మనిషి శరీరానికి అతుక్కుని రక్తాన్ని పీలుస్తున్నప్పుడు దానిపై ఉప్పు వేయడం మంచిది. ఇటువంటి సమయంలో జలగ ఔషధంలా ఉపయోగపడుతుంది. ఆయుర్వేదంలో జలగలను చికిత్స కోసం ఉపయోగిస్తారు. జలగలు మనిషి శరీరంలోని మురికి రక్తాన్ని పీల్చి, మృతకణాలను నాశనం చేస్తాయి. శరీరంలోని ఏదైనా భాగంలోని చర్మం దెబ్బతిన్నప్పుడు, రక్త ప్రసరణ ఆగిపోయినప్పుడు, మృతకణాలను సక్రియం చేయడానికి జలగలను ఉపయోగిస్తారు. కాగా జలగలు కలుషితమైన రక్తాన్ని మాత్రమే పీలుస్తాయి. స్వచ్ఛమైన రక్తాన్ని వదిలివేస్తాయి. ఈ సమయంలో, గాయాలు కూడా ఏర్పడతాయి. బాధితునికి అయిన గాయాలను డ్రెస్సింగ్ చేసిన తర్వాత ఇంటికి పంపిస్తారు. 

Updated Date - 2022-01-08T14:43:35+05:30 IST