రైళ్లకు పేర్లను ఎలా నిర్ణయిస్తారు? ఆ లెక్కలేమిటో తెలుసా?
ABN , First Publish Date - 2022-05-31T12:50:09+05:30 IST
భారతీయ రైల్వేలో మొత్తం 22,593 రైళ్లు ఉన్నాయి.
భారతీయ రైల్వేలో మొత్తం 22,593 రైళ్లు ఉన్నాయి. వీటిలో 9,141 సరుకు రవాణా రైళ్లు కాగా, 13,452 పాసింజర్ రైళ్లు. భారతీయ రైల్వే తన సేవలతో దేశం మొత్తాన్ని కలుపుతుంది. అయితే రైళ్లకు ఏ ప్రాతిపదికన పేర్లు పెడతారనే ప్రశ్న అందరిలో తలెత్తుతుంది. భారతీయ రైల్వే.. రైళ్లకు మూడు అంశాల ఆధారంగా పేర్లు పెడుతుంది.
వర్గం 1: స్థానం ఆధారంగా పేర్లు పెట్టడమనేది మొదటి కేటగిరీకి చెందినది. ఫలానా ప్రదేశం నుంచి ప్రారంభమై ఫలానా ప్రదేశానికి వెళ్లేది. ఉదాహరణకు.. ముంబై ఎక్స్ప్రెస్.. హైదరాబాద్ -ముంబై మధ్య నడుస్తుంది
వర్గం II: నిర్దిష్ట స్థాన ఆధారిత రైళ్లు.. ఇవి నిర్దిష్ట స్థానాలు, జాతీయ ఉద్యానవనాలు, స్మారక చిహ్నాలు లేదా ప్రాంతాల గుండా వెళతాయి. ఉదాహరణకు..ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్.. ఇది హైదరాబాద్ నుండి హౌరా వరకు నడుస్తుంది.
మూడవ వర్గం: రాజధానిని అనుసంధానించే రైళ్లు.. ఉదాహరణకు రాజధాని ఎక్స్ప్రెస్: ఇది దేశ రాజధాని ఢిల్లీని వివిధ రాష్ట్రాల రాజధానులతో కలుపుతుంది.
డీలక్స్ రైలు వర్గం: గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్.. ఇది డీలక్స్ రైలు వర్గం. ఈ రైలు సామాన్యులకు సైతం అందుబాటులో ఉండే ఆధునిక సౌకర్యాలతో కూడిన రైలు.