భార్య పరాయి మగవారితో ఉండగా చూడటమే అతడి వ్యసనం.. అందుకోసం చివరికి ఏం చేశాడో తెలుసా..

ABN , First Publish Date - 2022-02-05T03:14:56+05:30 IST

బెంగళూరులో ఓ ప్రబుద్దుడు కూడా పైకి మంచివాడిలాగే కనబడేవాడు. అయితే తన పైశాచికత్వాన్ని మొత్తం భార్య మీద చూపించాడు. భార్య ఇతరులతో ఏకాంతంగా ఉంటే చూడాలనేది తన కోరికట. అందుకోసం ..

భార్య పరాయి మగవారితో ఉండగా చూడటమే అతడి వ్యసనం.. అందుకోసం చివరికి ఏం చేశాడో తెలుసా..
ప్రతీకాత్మక చిత్రం

కొందరు జనంలో మంచి వారిలా కనిపిస్తుంటారు. కానీ ఇంటికి వెళ్లగానే వారి నిజ స్వరూపం బయటపడుతుంది. తమ పైశాచికత్వాన్ని మొత్తం భార్యల ముందు, చిన్న పిల్లల ముందు చూపిస్తుంటారు. చివరికి అందరితో ఛీ.. ఛీ.. అనిపించుకుంటూ ఉంటారు. బెంగళూరులో ఓ ప్రబుద్దుడు కూడా పైకి మంచివాడిలాగే కనబడేవాడు. అయితే తన పైశాచికత్వాన్ని మొత్తం భార్య మీద చూపించాడు. భార్య ఇతరులతో ఏకాంతంగా ఉంటే చూడాలనేది తన కోరికట. అందుకోసం తాను చేసిన నిర్వాకం... సభ్యసమాజం తల దించుకునేలా చేసింది. వివరాల్లోకి వెళితే..


బెంగళూరులోని మాండ్య ఏరియాకి చెందిన వినయ్ స్థానికంగా ఉన్న ఓ ఎలక్ట్రికల్ షాపులో పని చేస్తుండేవాడు. అక్కడ అతడికి రామనగర ప్రాంతానికి చెందిన యువతి పరిచయమైంది. ఇద్దరూ ప్రేమించుకున్నారు. అయితే వారి పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో  2019లో ఎదిరించి మరీ వివాహం చేసుకున్నారు. వీరికి ప్రస్తుతం ఏడాదిన్నర కూతురు ఉంది. ప్రస్తుతం వీరు బెంగళూరులోని పరప్పన అగ్రహారానికి దగ్గర్లోని సింగసాండ్రాలో స్థిరపడ్డారు. ఇటీవల వినయ్ తన ఫోన్లో అశ్లీల వీడియోలను చూడడం అలవాటు చేసుకున్నాడు. ఆ వ్యసనం చివరికి పైశాచికత్వానికి దారి తీసింది.

భార్య ప్రేమతో అడిగిందని బైక్‌లో బయటికి తీసుకెళ్లాడు.. ఉన్నట్టుండి మధ్యలో బండికి పంక్చర్.. అంతలోనే..


భార్య పరాయి మగవారితో ఏకాంతంగా ఉంటే చూడాలనే విచిత్రమైన ఆలోచన పుట్టింది. ఈ విషయంలో భార్యను రోజూ వేధించేవాడు. కొన్నాళ్లకు బలవంతంగా ఒప్పించి, పరాయి మగవారి వద్దకు పంపించేవాడు. ఆ సమయంలో చాటుగా చూడడమే కాకుండా వీడియోలు తీసేవాడు. ఇలా కొన్నాళ్లకు అతడు మరింత శాడిస్టులా మారాడు. సోషల్ మీడియా వేదికగా పరాయి పురుషులను ఆహ్వానించడం మొదలెట్టాడు. ఈ క్రమంలో ఓ వ్యక్తి అతడి పోస్టును పోలీసులకు పంపించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై స్థానికంగా తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. 

భార్యాభర్తలిద్దరూ పార్టీ చేసుకున్నారు.. ముక్కలు కూడా సిద్ధం చేసుకున్నారు.. మందు తాగుతూ చివరగా భార్యతో ఇలా అన్నాడు..

Read more