వైరల్ అవుతున్న FASTag Smart Watch Scam.. అందులో అసలు నిజం ఉందా?

ABN , First Publish Date - 2022-06-26T00:51:09+05:30 IST

ఫాస్టాగ్ స్కామ్‌ గురించి తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో బాగా వైరల్ అవుతోంది.

వైరల్ అవుతున్న FASTag Smart Watch Scam.. అందులో అసలు నిజం ఉందా?

ఫాస్టాగ్ స్కామ్‌ గురించి తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో బాగా వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసిన పలువురు అలాంటి స్కామ్‌లు కూడా జరుగుతాయా? అని ఆశ్చర్యపోతున్నారు. వాటిని నమ్మేసి భయభ్రాంతులకు గురవుతున్నారు. అయితే అది నిజం కాదని, ఆ పద్ధతిలో స్కాన్ చేయడం సాధ్యం కాదని ఫాస్టాగ్ స్పష్టం చేసింది. 


వైరల్ అవుతున్న ఆ వీడియోలో..  కారు అద్దాలు తుడవడానికి ప్రయత్నిస్తున్న ఓ కుర్రాడు.. ఆ కారు అద్దంపై ఉన్న ఫాస్టాగ్ స్టిక్కర్‌ను తన చేతికి ఉన్న స్మార్ట్‌వాచ్‌‌తో స్కానింగ్ చేసినట్టుగా కనబడుతోంది. ఆ తర్వాత ఆ బాలుడి చేతికి ఉన్న వాచీని చూసి కారులో ఉన్న వారు నిలదీయగా.. అతడు పారిపోయాడు. ఆ బాలుడిని వెంబడించిన వ్యక్తి నిరాశతో తిరిగి వచ్చి ఇదంతా ఫాస్టాగ్ స్కామ్ అని, అలా స్కాన్ చేయగానే మన అకౌంట్లోని డబ్బులు పోతాయని వివరించాడు. ఆ వీడియో చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. అయితే ఆ వీడియో నిజం కాదని, ఫేక్ అని ఫాస్టాగ్ పేర్కొంది. 


ఆ వీడియోపై స్పందించిన ఫాస్టాగ్.. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ ) వద్ద నమోదైన టోల్ ప్లాజా, పార్కింగ్ ప్లాజా మర్చంట్స్‌కి మాత్రమే ఫాస్టాగ్ స్టిక్కర్లను స్కాన్ చేసి డబ్బులు తీసుకునే అధికారం ఉంటుందని తెలిపింది. అనధికార పరికరాలు ఏవీ ఫాస్టాగ్‌లోంచి డబ్బులు డ్రా చేయలేవు అని స్పష్టం చేసింది. కాగా, ఆ వీడియో ఫేక్ అని ప్రెస్ ఇన్‌ఫర్మేషన్ బ్యూరో  క్లారిటీ ఇచ్చింది. 


Updated Date - 2022-06-26T00:51:09+05:30 IST