లిప్‌లాక్‌తో ఆరోగ్యానికి ఎంతో మేలు.. ఒక ముద్దుతో ఎన్ని ఉపయోగాలంటే..

ABN , First Publish Date - 2022-01-21T09:06:42+05:30 IST

ప్రేమకు ప్రతీకగా భావించే ముద్దు అసలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. మనుషుల ప్రేమలో పడ్డప్పుడు ఒకరినొకరు ముద్దుపెట్టుకోవడం సహజం. పాశ్చాత్య దేశాల్లో నివసించే వారు ముద్దుని తమ నిత్య జీవితంలో భాగంగా చేసుకున్నారు. హలో చెప్పాలన్నా, గుడ్ బై, గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ ఇలా ప్రతీ చిన్న సందర్భానికి...

లిప్‌లాక్‌తో ఆరోగ్యానికి ఎంతో మేలు.. ఒక ముద్దుతో ఎన్ని ఉపయోగాలంటే..

ప్రేమకు ప్రతీకగా భావించే ముద్దు అసలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. మనుషుల ప్రేమలో పడ్డప్పుడు ఒకరినొకరు ముద్దుపెట్టుకోవడం సహజం. పాశ్చాత్య దేశాల్లో నివసించే వారు ముద్దుని తమ నిత్య జీవితంలో భాగంగా చేసుకున్నారు. హలో చెప్పాలన్నా, గుడ్ బై, గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ ఇలా ప్రతీ చిన్న సందర్భానికి ముద్దు పెట్టుకొని పలకరించుకుంటారు. ఇలా పలకరింపులే కాకుండా ఆరోగ్యం కోసం కూడా ముద్దు బాగా ఉపయోగపడుతుందంటున్నారు నిపుణులు.


కిస్‌తో మానసిక, శారిరక ఆరోగ్యమందుతుంది. ఎందుకంటే ముద్దు పెట్టుకున్నప్పుడు శరీరంలోని స్ట్రెస్ తగ్గిపోతుంది, రక్తపోటు కంట్రోల్ లోకి వస్తుంది, దంతాలు, చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుందని పరిశోధనల్లో తేలింది. మీరు ఎదుటి వ్యక్తిని ఆప్యాయతతో ముద్దు పెట్టుకున్నప్పుడు మీ గుండె ఎక్కువ సార్లు కొట్టుకుంటుంది. శరీరంలో అడ్రెనలిన్ విడుదలవుతుంది.


ప్రియమైన వ్యక్తిని ముద్దాడిన సమయంలో మనిషి మెదడులో ఆక్సిటోసిన్, డోపమైన్, సెరోటొనిన్ లాంటి కొన్ని కెమికల్స్ విడుదలవుతాయి. ఇవి మనిషిలోని స్ట్రెస్‌ని కలిగించే హార్మోన్స్(కార్టిసోల్)ని అడ్డుకుంటాయి. తద్వారా మనిషి ఎక్కువ సమయం సంతోషంగా ఉంటాడు. త్వరగా కోపం కూడా రాదు. కార్టిసోల్ లెవెల్ తగ్గడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ కూడా తగ్గిపోతుంది. అలాగే తరుచూ కిస్ చేస్తుంటే గుండె ఎక్కువసార్లు కొట్టుకొని రక్త సరఫరా మెరుగుపడుతుంది. దీనివల్ల రక్తపోటు (బిపి) కంట్రోల్‌లో ఉంటుంది. 


దంతాలు ఆరోగ్యంగా ఉండడానికి కూడా ముద్దు బాగా ఉపయోగపడుతుంది. చుంబనం చేసిన సమయంలో నోటిలో లాలాజలం ఎక్కువ విడుదలై అది పళ్ల మధ్య పేరుకు పోయిన ప్లేక్‌ని కడిగేస్తుంది. లాలాజలం ఎక్కువ విడుదల కావడం వలన ఎదుటి వ్యక్తి నోటిలో మంచి బ్యాక్టీరియా ఎక్స్ఛేంజ్ అవుతుంది. దీనివల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.  అలాగే.. కిస్ చేయడం వల్ల మీ చర్మం కాంతివంతంగా, నిగనిగలాడుతుందని నిపుణులు చెబుతున్నారు. ముద్దు పెట్టుకుంటే మీ చర్మంలో లవ్ హార్మోన్ అమాంతం  పెరిగి.. చర్మం కాంతివంతంగా తయారవుతుందట. అదెలాగంటే ముద్దు పెట్టుకోవడం వల్ల ఆక్సిటోసిన్ హార్మోన్ అమాంతం పెరిగిపోయి.. ఇది యాంటి ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. దానివల్ల చర్మ కణాలు ఉత్తేజితమవుతాయి.


ఇవే కాకుండా స్ట్రెస్ తగ్గడం వల్ల తలనొప్పి, కండరాల నొప్పి, అలెర్జీల సమస్యలు కూడా తగ్గిపోతాయి. అన్నింటికంటే ముఖ్యంగా  ఒక చిన్న ముద్దు ఇద్దరి భాగస్వాముల మధ్యనున్న ఎలాంటి దూరాన్నైనా ఇట్టే కరిగించేస్తుంది.


Updated Date - 2022-01-21T09:06:42+05:30 IST