పెళ్లి గిఫ్టులు ఓపెన్ చేస్తుండగా పెద్ద పేలుడు.. తెగిపడిన వరుడి చెయ్యి.. దారుణం వెనుక పెద్ద కథ

ABN , First Publish Date - 2022-05-24T09:14:04+05:30 IST

పక్క ఊరి పిల్లను పెళ్లి చేసుకున్న లతీష్ అనే యువకుడికి ఘోరమైన ప్రమాదం జరిగింది. పెళ్లి వచ్చిన గిఫ్ట్ ప్యాకెట్లు ఓపెన్ చేస్తుండగా.. వాటిలో ఒకటి భయంకరంగా పేలింది. దాంతో అతని కుడి చెయ్యి మణికట్టు వరకు తెగి పడింది...

పెళ్లి గిఫ్టులు ఓపెన్ చేస్తుండగా పెద్ద పేలుడు.. తెగిపడిన వరుడి చెయ్యి.. దారుణం వెనుక పెద్ద కథ

పక్క ఊరి పిల్లను పెళ్లి చేసుకున్న లతీష్ అనే యువకుడికి ఘోరమైన ప్రమాదం జరిగింది. పెళ్లి వచ్చిన గిఫ్ట్ ప్యాకెట్లు ఓపెన్ చేస్తుండగా.. వాటిలో ఒకటి భయంకరంగా పేలింది. దాంతో అతని కుడి చెయ్యి మణికట్టు వరకు తెగి పడింది. ఈ ఘటన గుజరాత్‌లో వెలుగు చూసింది. 


నవసారీ జిల్లాలో జరిగిన ఈ ఘటనలో లతీష్‌తోపాటు అతని మేనల్లుడు, మూడేళ్ల జియాంష్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. అసలు ఏం జరిగిందని ఆరా తీయగా భయంకరమైన కథ వెలుగులోకి వచ్చింది. లతీష్ పెళ్లి చేసుకున్న అమ్మాయి పేరు సల్మా. ఆమె అక్క జాగృతి.. 2009 నుంచి రాజేష్ పటేల్ అనే యువకుడితో లివ్ ఇన్ రిలేషన్‌లో ఉంది. వాళ్లిద్దరికీ ఆరేళ్ల కూతురు కూడా ఉంది. అయితే ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. రాజేష్‌కు అంతకుముందే పెళ్లి అయింది. అతనికి ఆల్రెడీ ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఈ క్రమంలోనే రాజేష్, జాగృతి మధ్య ఇటీవల మనస్పర్ధలు మొదలయ్యాయి. దీంతో ఆమెను అడ్డుతొలగించుకోవాలని రాజేష్ ప్లాన్ చేశాడు. 


తన తమ్ముడి పెళ్లి కార్డుతోపాటు సల్మా పెళ్లికి బహుమతి ఇవ్వాలని తనకు తెలిసిన ఒక మహిళను పంపించాడు. గిఫ్ట్‌గా ఒక టెడ్డీబేర్ బొమ్మను ఇచ్చి, దాన్ని తన కూతురికి ఇవ్వాలని చెప్పాడు. అయితే పెళ్లికి వచ్చిన సదరు మహిళ ఆ బొమ్మను తీసుకెళ్లి జాగృతికి ఇచ్చింది. పెళ్లి చేసుకుంటున్న తన చెల్లికి వచ్చిన గిఫ్ట్ అనుకున్న ఆమె.. దాన్ని వారి గదిలో పెట్టింది. ఆ సమయంలోనే పెళ్లి గిఫ్టులు ఓపెన్ చేసిన లతీష్.. ఆ టెడ్డీ బేర్ బొమ్మ ఉన్న గిఫ్ట్ ఓపెన్ చెయ్యగానే దానిలో ఉన్న బాంబు పేలింది. ఈ ప్రమాదంలో లతీష్, జియాంష్ తీవ్రంగా గాయపడి ఆస్పత్రి పాలయ్యారు. లతీష్ కుడి చెయ్యి మణికట్టు వరకు తెగిపడింది. బావి తవ్వుకోవడానికి డైనమైట్ కావాలని అబద్ధం చెప్పి మహేష్ పటలే్ అనే వ్యక్తి దగ్గర నుంచి ఆ డైనమైట్‌ను రాజేష్ సంపాదించాడు. ఆ బొమ్మ సాయంతో జాగృతితోపాటు ఆమె కూతుర్ని కూడా మట్టుబెట్టాలని అనుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాజేష్‌తోపాటు మహేష్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు.


Updated Date - 2022-05-24T09:14:04+05:30 IST