కనువిందు చేస్తున్న పచ్చరంగు పావురం, సీతాకోక చిలుకలు
ABN , First Publish Date - 2022-02-01T16:31:26+05:30 IST
సేలం అడవుల్లో అరుదైన పచ్చరంగు పావురం, కొత్తరకం సీతాకోకచిలుకలు సందర్శకులకు కనువిందు చేస్తున్నాయి. సేలం జిల్లా అటవీ శాఖ అధికారి గౌతమ్ మీడియాతో మాట్లాడుతూ, జిల్లాలో
ప్యారీస్(చెన్నై): సేలం అడవుల్లో అరుదైన పచ్చరంగు పావురం, కొత్తరకం సీతాకోకచిలుకలు సందర్శకులకు కనువిందు చేస్తున్నాయి. సేలం జిల్లా అటవీ శాఖ అధికారి గౌతమ్ మీడియాతో మాట్లాడుతూ, జిల్లాలో 1,24,762.957 హెక్టార్ల విస్తీర్ణంలో అడవులతో కూడిన నీటివనరులున్నాయని, ఈ రిజర్వ్‌డు అడవుల్లో పలు రకాల వన్యప్రాణులు, పక్షులు స్వేచ్ఛగా సంచరిస్తున్నాయని తెలిపారు. పర్యావరణ ప్రేమికుల బృందం, స్వచ్ఛంధ సేవా సంస్థలతో కలసి 2021 ఫిబ్రవరి 17 నుంచి 19వ తేది వరకు చేపట్టిన సర్వేలో అరుదైన పక్షి జాతులు, సీతాకోకచిలుకలను గుర్తించినట్లు తెలిపారు. 147 రకాల సీతాకోకచిలుకలు, పచ్చరంగు పావురాలు, పలు దేశాల నుంచి వస్తున్న వలస పక్షులు సీజన్‌లో స్వేచ్ఛగా సేదతీరేందుకు అవసరమైన అన్ని వసతులు కల్పించినట్లు ఆయన తెలిపారు.