Super Star Krishna: నానమ్మ, తాతయ్య.. తల్లడిల్లిపోయిన సితార, గౌతమ్

ABN , First Publish Date - 2022-11-16T14:08:40+05:30 IST

ఒకే ఇంట్లో వరుస మరణాలను తట్టుకోవడం సామాన్యమైన విషయం కాదు. కానీ సూపర్ స్టార్ మహేష్ బాబు (Super Star Mahesh Babu) ఇంట్లో ఒకే ఏడాది ముగ్గురు చనిపోవడంతో.. ఆ కుటుంబం అంతా తీవ్ర విషాదంలో

Super Star Krishna: నానమ్మ, తాతయ్య.. తల్లడిల్లిపోయిన సితార, గౌతమ్
Super Star Krishna Family

ఒకే ఇంట్లో వరుస మరణాలను తట్టుకోవడం సామాన్యమైన విషయం కాదు. కానీ సూపర్ స్టార్ మహేష్ బాబు (Super Star Mahesh Babu) ఇంట్లో ఒకే ఏడాది ముగ్గురు చనిపోవడంతో.. ఆ కుటుంబం అంతా తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఆప్తులైన వారిని ఒకరి తర్వాత ఒకర్ని కోల్పోతుంటే.. వచ్చే బాధ వర్ణనాతీతం. అయితే ఆ దు:ఖాన్ని దిగమింగుకుంటూ.. తన తండ్రిని కడసారి చూడటానికి వచ్చిన వారిని మహేష్ బాబు పలకరిస్తున్నారు. తండ్రి పార్థివ దేహం పక్కన మహేష్‌ని చూసిన వారే తల్లడిల్లిపోతుంటే.. ఇక ఆ కుటుంబ సభ్యుల పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఇక తాతని కడసారి చూసేందుకు వచ్చిన మనవడు గౌతమ్ కృష్ణ (Goutham Krishna), మనవరాలు సితార (Sitara) అయితే వెక్కి వెక్కి ఏడ్చేశారు. రీసెంట్‌గానే నానమ్మ ఇందిరాదేవి చనిపోయింది.. ఇప్పుడు తాతయ్య కృష్ణ.. ఏమీ అర్థం కాని పరిస్థితి వారిది.

అభిమాన నటుడిని చివరిసారి చూసుకోవడానికి వచ్చిన లక్షలాది మంది అభిమానులు ఒకవైపు.. తాతయ్య పార్థివ దేహం మరో వైపు.. అసలేం జరుగుతుందో కూడా తెలియని ఆ చిన్నారులను మహేష్, నమ్రత ఓదార్చుతుంటే.. చూస్తున్న జనం కళ్లలో నీళ్లు ఆగలేదు. మొన్న నానమ్మ చనిపోయినప్పుడు సితార ఎలా ఎమోషనల్ అయిందో తెలియంది కాదు. మహేష్ బాబు ఒడిలో కూర్చుబెట్టుకుని సితారను ఓదార్చుతున్న తీరుని చూసి అంతా చలించిపోయారు. ఇప్పుడు తాతగారి పార్థిక దేహంపై పూలు చల్లి.. వాళ్లు నమస్కారం చేస్తున్నప్పుడు కూడా చుట్టూ ఉన్నవారి పరిస్థితి అదే. మహేష్ బాబు ఫ్యామిలీకే ఇలా ఎందుకు జరుగుతుంది అని అనుకోని వారు లేరంటే.. సంవత్సర కాలంగా ఆ ఫ్యామిలీ ఎంత దు:ఖంలో మునిగిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఆయన్ని కోల్పోయిన భారంతోనే ఇక ప్రతిరోజూ ఆ ఫ్యామిలీ గడపాలి.

Updated Date - 2022-11-16T14:45:19+05:30 IST