Golden Retriever: శునకం చేసిన అల్లరి పనికి నెటిజన్లు ఫిదా
ABN , First Publish Date - 2022-07-24T17:20:50+05:30 IST
మనుషులకు శునకాలు మంచి మిత్రులు. అవి చూపించే ప్రేమలో నిజాయితీ ఉంటుంది. ఉద్వేగాలను వెంటనే పసిగట్టి.. మనం బాధపడితే అవీ బాధపడతాయి. మనం సంతోషంగా ఉంటే.. అవి కూడా ఎగిరి గంతులు వేస్తాయి

ఇంటర్నెట్ డెస్క్: మనుషులకు శునకాలు మంచి మిత్రులు. అవి చూపించే ప్రేమలో నిజాయితీ ఉంటుంది. ఉద్వేగాలను వెంటనే పసిగట్టి.. మనం బాధపడితే అవీ బాధపడతాయి. మనం సంతోషంగా ఉంటే.. అవి కూడా ఎగిరి గంతులు వేస్తాయి. అవి ఇచ్చే ఓదార్పును మాటల్లో చెప్పలేం. శునకాలను పెంచుకునే వారికే ఈ విషయాలపై అవగాహన ఉంటుంది. కాగా.. ఇపుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే.. ఓ గోల్డెన్ రిట్రీవర్(Golden Retriever) శునకానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీంతో అది చేసిన చిలిపి పని చూసి నెటిజన్లు నవ్వుకుంటున్నారు. ఇంతకూ అది ఏం చేసిందంటే..
ఓ యువతికి శునకాలంటే చాలా ఇష్టం. ఈ క్రమంలోనే ఆమె.. Golden Retrieverను ఇంట్లో పెంచుకుంటోంది. శిక్షణ ఇస్తే ఇంటి పనుల్లో సహాయపడే ఈ శునకం.. తన యజమానురాలు వ్యాయామం చేస్తుండగా ఆమెను అనుకరించడం స్టార్ట్ చేసింది. ఈ క్రమంలోనే తనలో ఉన్న కళను బయటపెట్టింది. యజమానురాలి జుట్టుకు ఉన్న హెయిర్ బ్యాండ్‌ను ఆమెకు తెలియకుండా మెల్లిగా లాగేసుకోబోతూ దొరికిపోయింది. అది చేసిన చిలిపి పనికి దాని యజమానురాలు కడుపుబ్బా నవ్వుకున్నారు. కాగా.. ఈ దృశ్యాలను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అదికాస్తా Viral అయింది. ఈ క్రమంలో స్పందిస్తున్న కొందరు నెటిజన్లు.. తమ శునకాలు చేస్తే అల్లరి పనుల గురించి షేర్ చేసుకుంటున్నారు.