Viral News: సరదాగా సరస్సు వద్దకు వెళ్లిన ప్రేమజంట.. అక్కడ ప్రేయసి వింత కోరిక విని అతడు షాక్.. ఆ తర్వాత..

ABN , First Publish Date - 2022-08-28T17:24:00+05:30 IST

అందరి ప్రేమికుల్లానే వాళ్లు కూడా సరదాగా గడపాలనుకున్నారు. ఈ క్రమంలోనే స్థానికంగా ఉన్న సరస్సు వద్దకు వెళ్లారు. ప్రకృతిని చూసి ఎంజాయ్ చేస్తూ.. గాళ్‌ఫ్రెండ్‌ తన ప్రియుడిని ఓ వింత కోరిక కోరింది. అది

Viral News: సరదాగా సరస్సు వద్దకు వెళ్లిన ప్రేమజంట.. అక్కడ ప్రేయసి వింత కోరిక విని అతడు షాక్.. ఆ తర్వాత..

ఇంటర్నెట్ డెస్క్: అందరి ప్రేమికుల్లానే వాళ్లు కూడా సరదాగా గడపాలనుకున్నారు. ఈ క్రమంలోనే స్థానికంగా ఉన్న సరస్సు వద్దకు వెళ్లారు. ప్రకృతిని చూసి ఎంజాయ్ చేస్తూ.. గాళ్‌ఫ్రెండ్‌ తన ప్రియుడిని ఓ వింత కోరిక కోరింది. అది తొలుత అతడు షాకయ్యాడు. చివరకు చేసేదేమీ లేక.. ఆమె ముచ్చటను తీర్చాడు. అయితే.. ఆ దృశ్యాలను కొందరు వీడియో తీయడంతో.. సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అనంతరం ఏం జరిగిందనే పూర్తి వివరాల్లోకి వెళితే..



బిహార్‌(Bihar)లోని బనారసి వాసా ప్రాంతానికి చెందిన ఓ  యువతి.. హవేలీ ఖరగ్‌పూర్‌(Haveli Kharagpur)లో ఉంటూ చదువుకుంటోంది. బహదూర్‌పుర్ ప్రాంతానికి చెందిన మిల్తేష్‌ కుమార్ కూడా అక్కడే విద్యాభ్యాసం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇద్దరూ ఒకరికొకరు పరిచయం అయ్యారు. పరిచయంకాస్తా తర్వాత ప్రేమగా మారింది. రెండు నెలలుగా ఇద్దరూ ప్రేమలో(Love) మునిగితేలుతున్నారు. ఈ నేపథ్యంలోనే కాలక్షేపానికని హవేలీ ఖరగ్‌పూర్‌లో ఉన్న సరస్సు వద్దకు ఇరువురూ వెళ్లారు. అక్కడ ఆ యువతి.. మిల్తేష్‌ను వింత కోరిక కోరింది. ‘నీ రక్తంతో నా నుదిటన తిలకం దిద్దు’ అనేసరికి అతడు తొలుత షాకయ్యాడు. కానీ తర్వాత ఆమె ముచ్చట తీర్చాడు. పక్కనే ఉన్న బండరాయితో.. చేతి వేలును చీల్చి.. రక్తంతో ఆమె నుదిటన బొట్టుపెట్టాడు. అక్కడున్న కొందరు యువకులు ఈ దృశ్యాలను వీడియో తీసి, సోషల్ మీడియా(Social Media)లో పోస్ట్ చేశారు. అవికాస్తా వైరల్ కావడంతో.. కుటుంబ సభ్యుల దృష్టికి వెళ్లింది. యువతి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని.. ఆమె పెళ్లిని మిల్తేష్‌తో జరిపించారు. 


Updated Date - 2022-08-28T17:24:00+05:30 IST