రూ.15 లక్షలు ఇవ్వకపోతే ఆ వీడియో నెట్లో పెడతా.. యువకుడికి ఓ యువతి బెదిరింపులు!
ABN , First Publish Date - 2022-01-24T22:56:17+05:30 IST
ఇంటర్నెట్ వినియోగం విపరీతంగా పెరగడం వల్ల సైబర్ కేసులు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్నాయి.

ఇంటర్నెట్ వినియోగం విపరీతంగా పెరగడం వల్ల సైబర్ కేసులు కూడా ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్నాయి. మహిళలే కాదు.. పురుషులు కూడా ఇలాంటి కేసుల్లో ఇరుక్కుంటున్నారు. తాజాగా ఓ యువతి నుంచి బెదిరింపులు ఎదుర్కొంటున్న యువకుడు పోలీసులను ఆశ్రయించాడు. ఆ యువతి బారి నుంచి రక్షించాలని వేడుకున్నాడు. హర్యానాలోని రోహ్తక్లో ఈ ఘటన జరిగింది.
రోహ్తక్కు చెందిన ఓ యువకుడికి ఇటీవల ఆన్లైన్ ద్వారా ఓ యువతి పరిచయమైంది. ఇద్దరూ నెంబర్లు మార్చుకుని వాట్సాప్ ద్వారా చాట్ చేసుకున్నారు. అనంతరం వాట్సాప్ ద్వారా వీడియో కాల్ చేసుకున్నారు. ఇద్దరూ నగ్నంగా మారి మాట్లాడుకున్నారు. ఆ సందర్భంగా యువతి ఆ ఘటనను రికార్డు చేసింది. అనంతరం ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ ఆ యువకుడిని బెదిరించడం ప్రారంభించింది.
తనకు రూ.15 లక్షలు ఇవ్వకపోతే ఆ వీడియోను వైరల్ చేస్తానని బెదిరింపులు ప్రారంభించింది. తన వద్ద అంత డబ్బు లేదని బాధితుడు ఎంతగా ప్రాథేయపడినా ఆమె వినిపించుకోలేదు. దీంతో ఆ యువకుడు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితురాలి కోసం గాలింపు ప్రారంభించారు.