సోషల్ మీడియాలో తన ఫొటోలను అలా చూసి యువతి షాక్.. పోలీస్‌లను ఆశ్రయించడంతో బయటపడ్డ నిజం!

ABN , First Publish Date - 2022-10-07T19:44:45+05:30 IST

ఉన్నత చదువులు పూర్తి చేసుకున్న యువతి.. జాబ్ చేస్తూ సొంత కాళ్లపై బతుకుతోంది. ఆమె లైఫ్ హ్యాపీగా గడిచిపోతుండగా.. అనూహ్య ఘటన చోటు చేసుకుంది. అసభ్యకర రీతిలో ఉన్న ఆమె ఫొటోలు సోషల్ మీడియాలో దర్శనమి

సోషల్ మీడియాలో తన ఫొటోలను అలా చూసి యువతి షాక్.. పోలీస్‌లను ఆశ్రయించడంతో బయటపడ్డ నిజం!

ఇంటర్నెట్ డెస్క్: ఉన్నత చదువులు పూర్తి చేసుకున్న యువతి.. జాబ్ చేస్తూ సొంత కాళ్లపై బతుకుతోంది. ఆమె లైఫ్ హ్యాపీగా గడిచిపోతుండగా.. అనూహ్య ఘటన చోటు చేసుకుంది. అసభ్యకర రీతిలో ఉన్న ఆమె ఫొటోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. అవికాస్తా వైరల్ కావడంతో.. యువతి తీవ్ర ఇబ్బందులు పడింది. అనంతరం పోలీసులను ఆశ్రయించింది. యువతి ఫిర్యాదు అధికారులు రంగంలోకి దిగడంతో.. నిజం బయటపడింది. ఇంతకూ ఏం జరిగిందంటే..


మధ్యప్రదేశ్‌కు చెందిన యువతి.. ఉన్నత చదువులు పూర్తి చేసుకున్న తర్వాత జాబ్ చేస్తూ గ్వాలియర్‌ ప్రాంతంలో నివాసం ఉంటోంది. ఈ క్రమంలో రెండు నెలల క్రితం అసభ్యకర రీతిలో ఉన్న ఆ యువతి ఫొటోలు సోషల్ మీడియాలో అకస్మాత్తుగా దర్శనమిచ్చాయి. అవి చూసి ఆ యువతి ఒక్కసారిగా కంగుతింది. ఓ యువతి పేరుతో ఉన్న ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాం అకౌంట్లలో తన ఫొటోలు పోస్ట్ అవుతున్నట్టు గుర్తించింది. ఆ తర్వాత ఆయా సోషల్ మీడియా ప్లాట్‌ఫాంల వేదికగానే.. తన ఫొటోలను సామాజిక మాద్యమాల్లో పోస్ట్ చేయవద్దని అభ్యర్థించింది. అయితే ఆమెకు చేదు అనుభవం ఎదురవడంతో.. చివరికి పోలీసులను ఆశ్రయించింది. 


దీంతో రంగంలోకి దిగిన అధికారులు.. విచారణ జరిపి అమన్ రాయ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆ యువతి ముందు ప్రవేశపెట్టారు. అమన్‌రాయ్‌ను చూసి ఆ యువతి ఒక్కసారిగా షాకైంది. డ్రెహడూన్‌లో కలిసి చదువుకుంటున్న సమయంలో తామిద్దరం ప్రేమించుకున్నట్టు చెప్పింది. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల విడిపోయినట్టు వెల్లడించింది. ఆ కోపంతోనే తన ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఉంటాడని అభిప్రాయడింది. దీంతో అతడిపై కేసు నమోదు చేసుకున్న అధికారులు.. అమన్ రాయ్‌ని జైలుకు తరలించారు. 


Read more