రైల్లో ఒంటరిగా 22 ఏళ్ల యువతి.. ఆరుగురు కుర్రాళ్లు ఆమెను వేధిస్తున్నా స్పందించని ప్రయాణీకులు.. చివరకు షాకింగ్ సీన్..!

ABN , First Publish Date - 2022-05-18T21:32:44+05:30 IST

ఆ 22 ఏళ్ల యువతి నర్సింగ్ విద్యార్థిని.. కాలేజ్ అయిపోయాక ఇంటికి వెళ్లేందుకు ట్రైన్ ఎక్కింది.. ఆమె సీటుకు దగ్గర్లోనే మరో ఆరుగురు కుర్రాళ్లు కూర్చున్నారు..

రైల్లో ఒంటరిగా 22 ఏళ్ల యువతి.. ఆరుగురు కుర్రాళ్లు ఆమెను వేధిస్తున్నా స్పందించని ప్రయాణీకులు.. చివరకు షాకింగ్ సీన్..!

ఆ 22 ఏళ్ల యువతి నర్సింగ్ విద్యార్థిని.. కాలేజ్ అయిపోయాక ఇంటికి వెళ్లేందుకు ట్రైన్ ఎక్కింది.. ఆమె సీటుకు దగ్గర్లోనే మరో ఆరుగురు కుర్రాళ్లు కూర్చున్నారు.. ఒంటరిగా ఉన్న ఈ యువతిపై అసభ్యకర కామెంట్లు చేశారు.. ఆమెను తాకుతూ అసభ్యకరంగా ప్రవర్తించారు.. రైళ్లో చాలా మంది ప్రయాణికులు ఉన్నా వారెవరూ ఆ యువతిని కాపాడేందుకు రాలేదు.. దీంతో ఆ యువతి కుర్రాళ్ల నుంచి తప్పించుకునే క్రమంలో కదులుతున్న రైలు నుంచి దూకేసింది.. తీవ్ర గాయాల పాలై ప్రస్తుతం హాస్పిటల్‌లో చికిత్స అందుకుంటోంది.. బీహార్‌లోని ముజఫర్‌నగర్‌లో ఈ ఘటన జరిగింది. 


బరౌనీకి చెందిన 22 ఏళ్ల యువతి ముజఫర్‌నగర్‌లో నర్సింగ్ చదువుతోంది. కాలేజ్ అయిపోయాక సోమవారం సాయంత్రం ఇంటికి వెళ్లేందుకు జన్‌సదరన్ ఎక్స్‌ప్రెస్ ఎక్కింది. ఒంటరిగా ఉన్న ఆ యువతిని చూసిన ఆరుగురు కుర్రాళ్లు ఆమెను టీజింగ్ చేయడం ప్రారంభించారు. ఆమె గురించి అసభ్యకర కామెంట్లు చేశారు. ఆమెను తాకేందుకు ప్రయత్నించారు. అంత జరుగుతున్నా ఆ భోగీలో ఉన్న ఇతర ప్రయాణికులెవరూ ఆ యువతిని కాపాడేందుకు ముందుకు రాలేదు. దీంతో ఆ యువతి కదులుతున్న రైలు నుంచి కిందకు దూకేసింది. 


రైలు పట్టాల పక్కన తీవ్ర గాయాలతో పడి ఉన్న ఆమెను కొందరు వ్యక్తులు రైల్వే హాస్పిటల్‌లో జాయిన్ చేశారు. ఆ యువతి రెండు కాళ్లు, చేతులు, తల మీద గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న జీఆర్పీ పోలీసులు బాధిత యువతి నుంచి స్టేట్‌మెంట్ తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని నిందితులను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. 

Updated Date - 2022-05-18T21:32:44+05:30 IST