Viral Video: పిల్లలను తీసుకుని బయటికెళ్తున్నారా.. అయితే జాగ్రత్త.. ఎందుకో తెలియాలంటే ఈ వీడియో చూడండి!

ABN , First Publish Date - 2022-08-04T20:24:45+05:30 IST

తల్లిదండ్రులు అప్పుడప్పుడు పిల్లలను తీసుకుని సరదాగా కారులో బయటికెళ్తూ ఉంటారు. అలా వెళ్లినప్పుడు సహజంగానే పిల్లలను వెనక సీట్లో కూర్చోబెడతారు. అయితే పిల్లలను అలా వెనక సీట్లో కూర్చో

Viral Video: పిల్లలను తీసుకుని బయటికెళ్తున్నారా.. అయితే జాగ్రత్త.. ఎందుకో తెలియాలంటే ఈ వీడియో చూడండి!

ఇంటర్నెట్ డెస్క్: తల్లిదండ్రులు అప్పుడప్పుడు పిల్లలను తీసుకుని సరదాగా కారులో బయటికెళ్తూ ఉంటారు. అలా వెళ్లినప్పుడు సహజంగానే పిల్లలను వెనక సీట్లో కూర్చోబెడతారు. అయితే పిల్లలను అలా వెనక సీట్లో కూర్చోబెట్టినప్పుడు తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చెబుతోంది. లేదంటే ఊహించని నష్టం చోటు చేసుకుంటుందని ఆ వీడియో హెచ్చరిస్తోంది. కాగా.. ఇంతకూ ఏం జరిగిందనే పూర్తి వివరాల్లోకి వెళితే..


సుమారు 5-10ఏళ్ల మధ్య వయసు ఉండే ఓ చిన్నారి వెనక సీట్లో కూర్చుని కారులో ప్రయాణం చేస్తోంది. ఈ క్రమంలోనే రోడ్డుపై ట్రాఫిక్ సిగ్నల్ పడింది. దీంతో కారు అక్కడ కొద్ది సమయం వరకు ఆగింది. సరిగ్గా అప్పుడే.. వెనక సీట్లో కూర్చున్న చిన్నారి.. కారు కిటికీలోంచి తల బయటికి పెట్టి చుట్టు పక్కల పరిసరాలను గమనిస్తూ ఉంటుంది. ఇంతలో గ్రీన్ సిగ్నల్ పడటంతో.. కారు వేగంగా ముందుకు దూసుకుపోయింది. దీంతో ఒక్కసారిగా ఆ చిన్నారి కారులోంచి రోడ్డుపై పడిపోయింది. ఈ విషయాన్ని సదరు కారు నడిపే వ్యక్తి అస్సలు గమనించలేదు. రోడ్డుపై పాప పడిపోవడంతో ఒక్కసారిగా షాకైన తోటి ప్రయాణికులు.. వెంటనే స్పందించి ఆ చిన్నారిని రక్షించారు. ప్రస్తుతం ఆ చిన్నారి చిన్న చిన్న గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటన చైనాలోని నిగ్బో (Ningbo) నగరంలో చోటు చేసుకోగా.. దృశ్యాలు అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఆ వీడియో కాస్తా ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో స్పందిస్తున్న నెటిజన్లు.. పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలంటూ కామెంట్స్ చేస్తు్నారు. 




Updated Date - 2022-08-04T20:24:45+05:30 IST