అందరూ చూస్తుండగానే చెప్పులతో ఓ యువకుడిని చితకబాదిన యువతి.. నడిరోడ్డుపై అతడు చేసిన నిర్వాకానికి..

ABN , First Publish Date - 2022-06-15T20:17:57+05:30 IST

తనపై లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తికి ఓ యువతి నడిరోడ్డుపైనే బుద్ధి చెప్పింది.

అందరూ చూస్తుండగానే చెప్పులతో ఓ యువకుడిని చితకబాదిన యువతి.. నడిరోడ్డుపై అతడు చేసిన నిర్వాకానికి..

తనపై లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తికి ఓ యువతి నడిరోడ్డుపైనే బుద్ధి చెప్పింది.. అందరూ చూస్తుండగా చెప్పు తీసి కొట్టింది.. తనను అసభ్యంగా తాకి పారిపోతున్న యువకుడిని ఆ యువతి వెంటాడి మరీ పట్టుకుంది.. అనంతరం అతనికి దేహశుద్ధి చేసింది.. చుట్టుపక్కల వారు కూడా ఆ యువకుడిపై దాడికి దిగారు.. అయితే పోలీసులు వచ్చే ముందు ఆ యువకుడు వారి నుంచి తప్పించుకుని పారిపోయాడు. మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. 


ఇది కూడా చదవండి..

ఫోన్ వచ్చిందని రాత్రి 10 గంటలకు బయటకు వెళ్లిన భర్త.. కాసేపటికే ఫోన్ స్విచాఫ్.. చివరకు మామిడి తోటలో షాకింగ్ సీన్..!


సాగర్ జిల్లాలో బినా తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో యువతిపై ఓ యువకుడు వేధింపులకు పాల్పడ్డాడు. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించిన అనంతరం పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఆ యువతి కేకలు వేస్తూ అతడి వెంట పరుగెత్తింది. చుట్టూ ఉన్న కొందరు వ్యక్తులు ఏం జరిగిందో గ్రహించి ఆమె వెంట పరుగులు తీశారు. నిందితుడిని పట్టుకున్న యువతి చెప్పులతో అతడిని కొట్టింది. అతడు పారిపోయేందుకు ప్రయత్నించగా చుట్టూ ఉన్న వారు  అతడిని పట్టుకుని కొట్టారు. అయితే పోలీసులు వచ్చేలోపే యువకుడు తప్పించుకోగలిగాడు. ప్రస్తుతం నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Read more