14 ఏళ్ల బాలికపై అత్యాచారం.. వీడియో ఇంటర్నెట్‌లో పెడతామని బెదిరించి రూ.50 వేలు స్వాహా.. రూ.2.5 లక్షలు అడిగితే ఇవ్వలేదని..

ABN , First Publish Date - 2022-09-30T21:27:37+05:30 IST

రాజస్థాన్‌లో 16 ఏళ్ల మైనర్‌ బాలికపై కొందరు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

14 ఏళ్ల బాలికపై అత్యాచారం.. వీడియో ఇంటర్నెట్‌లో పెడతామని బెదిరించి రూ.50 వేలు స్వాహా.. రూ.2.5 లక్షలు అడిగితే ఇవ్వలేదని..

రాజస్థాన్‌లో 16 ఏళ్ల మైనర్‌ బాలికపై కొందరు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ ఘటనను  వీడియోలు తీశారు. ఆ వీడియోలను ఇంటర్నెట్‌లో పెడతామని బెదిరించి బాలిక నుంచి రూ.50 వేలు వసూలు చేశారు. ఆ తర్వాత రూ.2.5 లక్షలు కావాలని డిమాండ్ చేశారు. బాలిక ఆ డబ్బులు చెల్లించలేకపోవడంతో ఆమె వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజస్థాన్‌లోని అల్వార్‌లో ఈ ఘటన జరిగింది. 


ఇది కూడా చదవండి..

మూడ్రోజులుగా జ్వరంతో బాధపడుతున్న 13 ఏళ్ల బాలిక.. డాక్టర్ చేసిన ఇంజెక్షన్‌తో దారుణం.. చివరకు..


బాధిత బాలికపై 9 నెలల క్రితం 8 మంది యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ ఘటన మొత్తాన్ని వీడియో తీశారు. ఆ వీడియోతో బ్లాక్ మెయిల్ చేసి బాలిక నుంచి ముందు రూ.50 వేలు తీసుకున్నారు. ఆ తర్వాత రెండున్నర లక్షల రూపాయలు అడిగారు. బాలిక 2.5 లక్షల రూపాయలు చెల్లించలేకపోవడంతో, నిందితులు ఆమె వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియోలను బాధిత బాలిక కుటుంబ సభ్యులు చూసి ఉలిక్కిపడ్డారు. 


బాధితురాలిని అడగ్గా ఆమె మొత్తం విషయం చెప్పింది. దీంతో బాధితురాలి తండ్రి 8 మంది యువకులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక స్టేట్‌మెంట్ తీసుకున్న పోలీసులు నిందితులపై పోక్సో, ఐటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు ప్రారంభించారు. 

Read more