Viral Video: ఏం ఐడియా గురూ! భవిష్యత్తులో స్మార్ట్ `మెట్రో` ఇలా ఉంటుందా? నెటిజన్లు ఏమంటున్నారంటే..
ABN , First Publish Date - 2022-12-07T20:10:14+05:30 IST
సాంకేతికత అందుబాటులోకి వచ్చిన కొద్దీ మానవ జీవితం మరింత సులభతరం అవుతుంటుంది. ఇప్పటికే చాలా పనులు కాలు కూడా కదపకుండా చేసేస్తున్నాం. సరికొత్త సాంకేతిక పరికరాలు అందుబాటులోకి వచ్చి మనిషికి శ్రమను దూరం చేస్తున్నాయి. ఇక, మెట్రో రైలు నుంచి నేరుగా మనం ఇంట్లోనే ల్యాండ్ అయితే ఎలా ఉంటుంది.
సాంకేతికత అందుబాటులోకి వచ్చిన కొద్దీ మానవ జీవితం మరింత సులభతరం అవుతుంటుంది. ఇప్పటికే చాలా పనులు కాలు కూడా కదపకుండా చేసేస్తున్నాం. సరికొత్త సాంకేతిక పరికరాలు అందుబాటులోకి వచ్చి మనిషికి శ్రమను దూరం చేస్తున్నాయి. ఇక, మెట్రో రైలు (Metro Train) నుంచి నేరుగా మనం ఇంట్లోనే ల్యాండ్ (Metro Dropping Boy Directly Inside Home) అయితే ఎలా ఉంటుంది. తాజాగా వైరల్ అవుతున్న వీడియో ఆ ఊహను కళ్లకు కట్టినట్టు చూపించింది. ఆ వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.
ఆ వీడియోలో ఒక మహిళ తన ఇంట్లో సోఫా మీద కూర్చుని ఫోన్ చూస్తోంది. ఇంతలో ఆమె ఇంటి కింద నుంచి మెట్రో రైలు వచ్చింది. ఆ రైలు నుంచి ఆమె కొడుకు నేరుగా ఇంట్లోనే దిగిపోయాడు. ఇది భవిష్యత్తు మెట్రోరైలు (Futuristic Metro) అని ఆ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఈ ఆలోచన అద్భుతంగా ఉందని కొందరు కామెంట్లు చేస్తే, ఇది చాలా భయంకరంగా ఉందని మరికొందరు వ్యాఖ్యానించారు.