Viral News: 13 మంది కుటుంబ సభ్యులు.. తినేది తెలంగాణలో.. పడుకునేది మహారాష్ట్రలో

ABN , First Publish Date - 2022-12-16T10:51:41+05:30 IST

ఒకే సమయంలో రెండు వేరు వేరు ప్రాంతాల్లో గడిపితే ఎలా ఉంటుంది. చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది కదూ. అదే భోజనాది కార్యక్రమాలు ఒక రాష్ట్రంలో చేసి మరో రాష్ట్రంలో కనుకు తీస్తే..

Viral News: 13 మంది కుటుంబ సభ్యులు.. తినేది తెలంగాణలో.. పడుకునేది మహారాష్ట్రలో

ఇంటర్నెట్ డెస్క్: ఒకే సమయంలో రెండు వేరు వేరు ప్రాంతాల్లో గడిపితే ఎలా ఉంటుంది. చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది కదూ. అదే భోజనాది కార్యక్రమాలు ఒక రాష్ట్రంలో చేసి మరో రాష్ట్రంలో కనుకు తీస్తే.. ఆ కిక్ మామూలుగా ఉండదు. ఇటువంటి అనుభూతిని పొందేందుకు పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తూ టూరిస్ట్ ప్రదేశాలకు వెళ్తూ ఉంటారు. కానీ ఓ ఫ్యామిలీ మాత్రం కొన్నేళ్లుగా ఈ వింత అనుభూతిని ఎంజాయ్ చేస్తోంది. ఇంటిని రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సరిహద్దు వేరు చేయడంతో వాళ్లకు ఆ పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రల మధ్య సరిహద్దు(Maharashtra-Telangana Border) ఇంటిని రెండుగా విడగొట్టడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా? అయితే పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే.

ఆ గ్రామం పేరు మహారాజాగూడా(Maharajaguda Village). మహారాష్ట్ర(Maharashtra)లోని చంద్రపూర్ జిల్లాలో ఉన్న ఈ మారుమూల గ్రామమే ఆ రాష్ట్రానికి చెందిన చిట్టచివరి ఊరు. తెలంగాణ-మహారాష్ట్రల మధ్య ఉన్న ఈ గ్రామంలో ఉత్తమ్ పవార్, చందు పవార్‌ అనే సోదరులు తమ కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నారు. కాగా.. 1969 సర్వే సందర్భంగా ఏర్పాటు చేసిన సరిహద్దు ఈ అన్నదమ్ములు నివాసం ఉంటున్న 10 గదుల ఇంటిని రెండుగా విడగొట్టింది. అప్పటి నుంచి ఆ కుటుంబ సభ్యులు రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రాపర్టీ ట్యాక్స్‌ను చెల్లిస్తూనే ఉన్నారు. అంతేకాదూ రెండు రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వ పథకాలనూ పొందుతున్నారు.

‘13 మంది సభ్యులుగల పెద్ద కుటుంబం మాది. 1969లో జరిగిన సర్వే కారణంగా మా ఇల్లు రెండుగా విడిపోయింది. దీంతో బెడ్‌రూమ్‌లు, హాల్ మహారాష్ట్ర కిందకు వెళ్లిపోతే.. కిచెన్‌తో పాటు మరికొన్ని గదులు తెలంగాణ(Telangana Border)లోకి వెళ్లిపోయాయి. ఇలా జరిగినందు వల్ల రెండు రాష్ట్రాలకూ ప్రాపర్టీ ట్యాక్స్‌లను చెల్లించాల్సి వస్తుంది. అయినా పెద్దగా ఇబ్బంది ఏం లేదు. రెండు రాష్ట్రాలకు చెందిన సంక్షేమ పథకాలను మేము అందుకుంటున్నాం’ అని ఆ సోదరులు అంటున్నారు.

Updated Date - 2022-12-16T11:29:09+05:30 IST