చాణక్యనీతి: అలాంటివారు దగ్గరుంటే జీవితం నాశనమే!

ABN , First Publish Date - 2022-06-02T11:38:25+05:30 IST

ఆచార్య చాణక్యుని విధానాలు మనకు...

చాణక్యనీతి: అలాంటివారు దగ్గరుంటే జీవితం నాశనమే!

ఆచార్య చాణక్యుని విధానాలు మనకు జీవితంలోని అనేక లోతైన విషయాలపై అవగాహన కల్పిస్తాయి. జీవితాన్ని సులభతరం చేయడానికి, జీవితంలో విజయం సాధించడానికి, ఏది తప్పు? ఏది ఒప్పు? అని తెలుసుకునేందుకు ఉపకరిస్తాయి. చాణక్యనీతిలో మనిషి ఎటువంటివారికి దూరంగా ఉంటే విజయం సాధిస్తాడనే వివరాలు ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు చూద్దాం. 

చెడు అలవాట్లు కలిగినవారితో..

ఆచార్య చాణక్యుడు తెలిపిన వివరాల ప్రకారం చెడు అలవాట్లు కలిగినవారికి దూరంగా ఉండాలి. ఎందుకంటే వారి చెడు అలవాట్లు మీ జీవితంపై ప్రభావాన్ని చూపిస్తాయి. అందుకే ఎల్లప్పుడూ సత్ప్రవర్తన కలిగినవారితోనే సహవాసం చేయాలి.


చెడు ప్రదేశంలో ఉండేవారితో.. 

చాణక్య నీతిలో అందించిన వివరాల ప్రకారం చెడు ప్రదేశంలో నివసించే వ్యక్తులతో ఎప్పుడూ స్నేహం చేయకూడదు. ఎందుకంటే చెడు ప్రదేశంలో నివసించే వ్యక్తి ఆ ప్రదేశంలోని చెడులకు దూరంగా ఉండలేడు. అలాంటి వ్యక్తితో స్నేహం చేస్తే మీ జీవితంపై ప్రభావం పడుతుంది. అందుకే అలాంటి వారికి ఎప్పుడూ దూరంగా ఉండాలి.

సత్ప్రవర్తన లేనివారితో..

ఆచార్య చాణక్యుడు తెలిపిన వివరాల ప్రకారం తల్లిదండ్రులను, ఇతరులను గౌరవించని వారితో స్నేహం చేస్తే, ఆ వ్యక్తి గౌరవం మంటగలుస్తుంది. జన్మనిచ్చిన తల్లిదండ్రులనే గౌరవించలేని వ్యక్తి మరొకరితో మంచి స్నేహం ఎలా కొనసాగించగలడని ఆచార్య ప్రశ్నించారు.

చెడు దృష్టి కలిగినవారితో..

చెడు దృష్టి కలిగినవారితో స్నేహం సరైనదికాదని ఆచార్య చాణక్య తెలిపారు. అలాంటివారితో స్నేహం పాపం చేయడంతో సమానమని ఆచార్య చాణక్య తెలిపారు. అలాంటివారితో స్నేహం చేసేవారు ఎప్పుడైనా ఇబ్బందుల్లో పడతారని చాణక్య హెచ్చరించారు.

Updated Date - 2022-06-02T11:38:25+05:30 IST