స్నేహితుడు కేవలం ఒక మాట చెప్పినందుకు హత్య చేసిన నలుగురు వ్యక్తులు.. అతడు ఏం చెప్పాడంటే..
ABN , First Publish Date - 2022-04-06T08:33:53+05:30 IST
దొంగతనం చేయవద్దని చెప్పినందుకు తమ ప్రాణ స్నేహితుడిని పొట్టన పెట్టుకున్నారు నలుగురు వ్యక్తులు. అతడిని గొంతు కోసి చంపేసి పెట్రోల్ పోసి తగలబెట్టేశారు. సగం కాలిన మృతదేహాన్ని అడవిలో వదిలేశారు...

దొంగతనం చేయవద్దని చెప్పినందుకు తమ ప్రాణ స్నేహితుడిని పొట్టన పెట్టుకున్నారు నలుగురు వ్యక్తులు. అతడిని గొంతు కోసి చంపేసి పెట్రోల్ పోసి తగలబెట్టేశారు. సగం కాలిన మృతదేహాన్ని అడవిలో వదిలేశారు. ఆ మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు తరలించిన పోలీసులు దర్యాఫ్తు ప్రారంభించి నలుగురు నిందితులను పట్టుకున్నారు. వారిని కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్‌కు తరలించారు.
వివరాల్లోకి వెళితే.. యూపీలోని గౌతమ్ బుద్ధ్ నగర్ జిల్లా గ్రేటర్ నోయిడాకు సమీపంలోని ఎకోటెక్-3 పరిధిలో ఈ నెల 26న సగం కాలిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టంకు తరలించారు. అనంతరం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మరణించిన వ్యక్తిని బదౌన్ నివాసి వివేక్‌గా గుర్తించిన పోలీసులు అతని స్నేహితులు సఫియా, ఆకాష్, సంజయ్, మోహన్‌లను అరెస్ట్ చేశారు.
నిందితులందరూ ఎకోటెక్-3 ప్రాంతంలో ఉన్న మూతపడిన ఫ్యాక్టరీలు, కంపెనీల్లో దొంగతనాలు చేసేవారు. వారి స్నేహితుడు వివేక్ వారిని దొంగతనం వద్దని హెచ్చరించేవాడు. పోలీసులకు చెబుతానని కూడా బెదిరించాడు. దీంతో వారు వివేక్‌పై కోపం పెంచుకున్నారు. మార్చి 25వ తేదీ రాత్రి 8.30 గంటల ప్రాంతంలో నలుగురూ కలిసి వివేక్‌ను బైక్‌పై ఊరవతలకు తీసుకెళ్లారు. అక్కడ అతడిని కాల్చి చంపారు. మృతదేహాన్ని ఎవరూ గుర్తుపట్టకుండా పెట్రోల్ పోసి కాల్చేశారు.