పెళ్లి వేదికపై ఓ ఫ్రెండ్ వింత నిర్వాకం.. మర్నాడే షాకింగ్ ట్విస్ట్.. భార్యతో హ్యాపీగా ఉండాల్సిన వరుడు కాస్తా జైల్లోకి..!

ABN , First Publish Date - 2022-05-17T19:59:44+05:30 IST

ఆ యువకుడి పెళ్లి వైభవంగా జరుగుతోంది.. బంధుమిత్రుల మధ్య అతను సంతోషంగా వివాహం చేసుకున్నాడు..

పెళ్లి వేదికపై ఓ ఫ్రెండ్ వింత నిర్వాకం.. మర్నాడే షాకింగ్ ట్విస్ట్.. భార్యతో హ్యాపీగా ఉండాల్సిన వరుడు కాస్తా జైల్లోకి..!

ఆ యువకుడి పెళ్లి వైభవంగా జరుగుతోంది.. బంధుమిత్రుల మధ్య అతను సంతోషంగా వివాహం చేసుకున్నాడు.. అయితే రిసెప్షన్ సమయంలో ఓ స్నేహితుడు మద్యం సీసా తీసుకు వచ్చి తాగాల్సిందిగా వరుడిని బలవంతం చేశాడు.. దీంతో స్నేహితులతో కలిసి వరుడు కాస్త మద్యం సేవించాడు.. ఆ ఘటనను ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.. ఆ వీడియో కాస్తా పోలీసుల కంట పడడంతో వరుడి కొంప మునిగింది.. పెళ్లి జరిగిన తర్వాతి రోజే వరుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.. ఎందుకంటే ఆ ఘటన జరిగింది గుజరాత్‌లో.. అక్కడ మద్యపానం నిషేధం అమల్లో ఉంది. 


గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు సమీపంలోని భిష్తివాడాకు చెందిన కపిల్ వర్మకు గత వారం వివాహం జరిగింది. వివాహ వేడుకకు చిరాగ్ అనే వ్యక్తి మద్యం సీసా తీసుకొచ్చి వరుడికి బహూకరించాడు. అంతేకాదు వేదిక మీదే వరుడి చేత బలవంతంగా తాగించాడు. ఆ ఘటనను ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారి పోలీసుల కంటపడింది. ఆ వీడియోను చూసిన పోలీసులు వరుడి ఇంటికి చేరుకున్నారు. 


వరుడు కపిల్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. తర్వాతి రోజు అనిల్ స్నేహితుడు చిరాగ్‌ను కూడా అరెస్ట్ చేశారు. గుజరాత్‌లో 2017 నుంచి మద్యపాన నిషేధ చట్టం అమల్లో ఉంది. ఈ చట్టాన్ని ఉల్లంఘించిన వారికి పదేళ్ల వరకు జైలు శిక్ష, రూ.5 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. 

Updated Date - 2022-05-17T19:59:44+05:30 IST