చాణక్యనీతి: వీటిలో ఏదో ఒక లక్ష్యం తప్పనిసరి.. లేదంటే జీవితం నిరర్థకం!
ABN , First Publish Date - 2022-04-25T12:48:22+05:30 IST
ఆచార్య చాణక్య తన విధానాలలో అనేక జీవిత రహస్యాలను...

ఆచార్య చాణక్య తన విధానాలలో అనేక జీవిత రహస్యాలను వెల్లడించారు. ఆయన రచించిన నీతి శాస్త్రంలో సాధారణ వ్యక్తి సైతం విజయం సాధించడానికి అనేక మార్గాలు తెలియజేశారు. చాణక్య తెలిపిన వివరాల ప్రకారం ఏ వ్యక్తి అయినా ఏదో ఒక కారణంతో ఈ భూమిపై జన్మించాడు. అందుకే మనిషి తన జీవితంలో కొన్నయినా మంచి పనులను చేయాలి. తద్వారా జనం అతనిని గుర్తుంచుకుంటారు. ఆచార్య చాణక్య తన నీతి శాస్త్రంలోని ఒక శ్లోకం ద్వారా మనిషి తన జీవితంలో ఈ నాలుగు విషయాలలో ఏదో ఒకదాన్ని అనుసరించడం తప్పనిసరి అని చెప్పారు. లేని పక్షంలో అతని జీవితం వృథాయేనని తెలిపారు.
శ్లోకం
ధర్మార్థకామమోక్షేశు యశ్యౌక్యోపి న విద్యతే।
జన్మ జన్మని మర్త్యేషు మరణం తస్య కేవలమ్।।
చాణక్య నీతిశాస్త్రంలోని ఈ శ్లోకార్థం ఏమిటంటే.. మనిషిగా జన్మించిన తరువాత, ధర్మం, కామం, భోగం, మోక్షం.. మొదలైనవాటిలో ఏ ఒక్క అంశాన్ని పొందని వ్యక్తి మృతునితో సమానం. అలాంటి వారికి జీవితంతో ఎటువంటి ప్రయోజనం ఉండదని చాణక్యుడు చెప్పాడు. అలాంటి వారు జీవిత పరమార్థాన్ని సాధించలేరని పేర్కొన్నారు.
ధర్మం
ఆచార్య చాణక్య తెలిపిన ప్రకారం మనిషి తన ధర్మాన్ని(మతాన్ని) అనుసరించాలి. ఎందుకంటే అది వ్యక్తిని సరైన జీవిత మార్గంలో తీసుకెళ్తుంది. ఫలితంగా అతను సత్కర్మలు చేయగలుగుతాడు.
కర్మ
మనిషిగా జన్మించిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా జీవితంలో ఏదో ఒక పని చేయాలని ఆచార్య చాణక్య తెలిపారు. ఏపనీ చేయకుండా జీవితాన్ని గడిపేవారు కుటుంబానికి, సమాజానికి భారం అని పేర్కొన్నారు. అటువంటి వారు వారి వంశాన్ని నాశనం చేసుకున్నవారవుతారని చాణక్య వివరించారు.
డబ్బు
ఆచార్య చాణక్య తన చాణక్య నీతిలో పేర్కొన్న వివరాల ప్రకారం సంతోషకరమైన జీవితాన్ని గడపడానికి ఎవరికైనా డబ్బు అవసరం. డబ్బు సంపాదనకు తగిన లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. లక్ష్యం లేని వ్యక్తి సంపదను కూడబెట్టుకోలేడు.
మోక్షం
ఇది మానవ జీవితంలో చివరి దశ అని ఆచార్య చాణక్య తెలిపారు. ఒక వ్యక్తి తాను ఏర్పరుచుకున్న లక్ష్యం, చేసే కర్మల ద్వారా మోక్షాన్ని పొందుతాడు. సత్కర్మలు చేసిన వారికే మోక్షం లభిస్తుందని చాణక్య తెలిపారు.