Flight Delay: బాయ్‌ఫ్రెండ్, గాళ్‌ఫ్రెండ్ మధ్య వాట్సాప్ ఛాటింగ్.. ఆరు గంటలు ఆగిపోయిన విమానం!
ABN , First Publish Date - 2022-08-15T21:07:01+05:30 IST
ఒక వ్యక్తికి తన గాళ్‌ఫ్రెండ్ నుంచి వచ్చిన మెసేజ్ వల్ల మంగుళూరు (Mangaluru) నుంచి ముంబై (Mumbai) వెళ్లాల్సిన

ఒక వ్యక్తికి తన గాళ్‌ఫ్రెండ్ నుంచి వచ్చిన మెసేజ్ వల్ల మంగుళూరు (Mangaluru) నుంచి ముంబై (Mumbai) వెళ్లాల్సిన విమానం ఆరు గంటల (Flight Delay) పాటు ఆగిపోయింది. 185 మంది ప్రయాణికులు విమానాశ్రయంలోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఈ ఘటన మంగళూరు విమానాశ్రయంలో ఆదివారం చోటు చేసుకుంది. మంగుళూరుకు చెందిన ఓ వ్యక్తి ముంబై వెళ్లేందుకు ఆదివారం సాయంత్రం విమానాశ్రయంలో ఇండిగో విమానం ఎక్కాడు. అతడి గాళ్‌ఫ్రెండ్ బెంగళూరు వెళ్లేందుకు అదే విమానాశ్రయానికి వచ్చింది. అయితె ఆమె ఫ్లైట్ మిస్ కావడంతో ఎయిర్‌పోర్ట్‌లోనే ఉండిపోయింది.
ఇది కూడా చదవండి..
Rajasthan: కూతురి కోసం రాత్రంతా వెతికిన తల్లిదండ్రులు.. తర్వాతి రోజు బస్టాప్‌లో అపస్మారక స్థితిలో పడి ఉన్న కూతురిని చూసి షాక్.. ఏం జరిగిందంటే..
ముంబై విమానంలో ఉన్న తన బాయ్‌ఫ్రెండ్‌తో సరదాగా ఛాటింగ్ ప్రారంభించింది. తన బాయ్‌ఫ్రెండ్‌ను `బాంబ్` అని వర్ణిస్తూ ఓ మెసేజ్ పంపింది. ఆ మెసేజ్‌ను విమానంలో అతడి పక్కనే కూర్చున్న మహిళా ప్రయాణికురాలు చూసి క్యాబిన్ సిబ్బందికి సమాచారం అందించింది. దీంతో టేకాఫ్‌కు సిద్ధమైన విమానం విమానాశ్రయంలోనే ఉండిపోయింది. మంగుళూరు పోలీసులు వెంటనే విమానంలోకి ప్రవేశించి అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. 185 మంది ప్రయాణికులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
దాదాపు ఐదు గంటలు ఆ వ్యక్తిని విచారించిన పోలీసులు అది స్నేహపూర్వక సంభాషణే అని తేల్చారు. దాదాపు ఆరు గంటల తర్వాత ప్రయాణికులను ముంబై విమానంలోకి అనుమతించారు. దీంతో విమానం సాయంత్రం ఐదు గంటలకు బయలుదేరింది. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదూ నమోదు కాలేదని పోలీసులు తెలిపారు.