‘‘గుడ్ టచ్, బ్యాడ్ టచ్’’పై క్లాసులో చెబుతుండగా.. పైకి లేచిన బాలిక.. తండ్రి, సోదరుడు, తాత, మామ గురించి ఆమె చెప్పింది విని..

ABN , First Publish Date - 2022-03-20T02:18:33+05:30 IST

క్రూరమృగాలన్నీ కలిసి ఒక మూగ జీవాన్ని వేటాడటం చూస్తే.. అయ్యో పాపం అనిపిస్తుంది. కానీ అది వాటి లక్షణమే కాబట్టి చేసేదేమీ లేదని సర్దిచెప్పుకుంటాం. కానీ మానవ సమాజంలో..

‘‘గుడ్ టచ్, బ్యాడ్ టచ్’’పై క్లాసులో చెబుతుండగా.. పైకి లేచిన బాలిక.. తండ్రి, సోదరుడు, తాత, మామ గురించి ఆమె చెప్పింది విని..
ప్రతీకాత్మక చిత్రం

క్రూరమృగాలన్నీ కలిసి ఒక మూగ జీవాన్ని వేటాడటం చూస్తే.. అయ్యో పాపం అనిపిస్తుంది. కానీ అది వాటి లక్షణమే కాబట్టి చేసేదేమీ లేదని సర్దిచెప్పుకుంటాం. కానీ మానవ సమాజంలో అంతకంటే క్రూరమైన మృగాళ్లు మనిషి రూపంలో తిరుగుతున్నా చూస్తూ ఉంటామే గానీ ఏమీ చేయలేని పరిస్థితి. ఎన్ని చట్టాలు వచ్చినా.. బాలికలు, యువతులు, మహిళలపై నిత్యం దాడులు, అత్యాచారాలు, హత్యలూ జరుగుతూనే ఉన్నాయి. కొందరు ప్రబుద్ధులు వరస, వయసు కూడా మరచి ప్రవర్తిస్తుంటారు. మహారాష్ట్రలో ఓ అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఓ పాఠశాలలో గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి టీచర్ వివరిస్తోంది. అప్పుడే ఓ బాలిక పైకి లేచి.. తన తండ్రి, సోదరుడు, మామ, తాత గురించి చెప్పింది. ఆమె మాటలు విని అంతా షాక్ అయ్యారు...


బీహార్‌కు చెందిన ఓ కుటుంబం కొన్నేళ్లుగా పూణేలో నివాసం ఉంటోంది. ఓ వ్యక్తి తన 11ఏళ్ల కూతురు, కొడుకుతో కలిసి నివాసం ఉంటున్నాడు. బాలిక స్థానికంగా ఉన్న ఓ పాఠశాలలో చదువుతోంది. శనివారం ఆమె క్లాసులో ఉండగా.. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి టీచర్ వివరిస్తోంది. అప్పుడే ఆ బాలిక పైకి లేచి.. ‘‘మేడమ్! నాకూ ఇలాగే జరిగింది మేడమ్’’.. అంటూ తన తండ్రి, సోదరుడు, మామ, తాత గురించి చెప్పింది. ఆమె చెప్పింది విని షాకైన టీచర్.. విషయాన్ని పోలీసులకు తెలియజేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను విచారిస్తున్నారు. పోలీసుల కథనం మేరకు.. బాలిక కుటుంబం 2107లో బీహార్‌లో ఉన్న సమయంలో తండ్రి ఆమెపై మొదటిసారిగా అత్యాచారానికి పాల్పడ్డాడు. తర్వాత తరచూ లైంగిక దాడికి పాల్పడేవాడు.

మేడమ్! మసాజ్ చేయించుకుంటే సమస్యలు దూరమవుతాయ్.. అంటూ టూరిస్ట్‌తో అన్నాడు.. గదిలోకి వెళ్లిన కాసేపటికి చూస్తే..


ఈ క్రమంలో 2020లో పూణేలో ఉన్న సమయంలో బాలిక సోదరుడు కూడా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. కొన్నాళ్ల తర్వాత వరుసకు మామ అయ్యే వ్యక్తి కూడా బాలికను తరచూ తాకరాని చోట తాకుతూ అనుచితంగా ప్రవర్తించేవాడు. ఇలా ఆ వ్యక్తి కూడా బాలికపై ఘాతుకానికి పాల్పడ్డాడు. ఇదిలావుండగా బాలికకు వరుసకు తాత అయ్యే 60 ఏళ్ల వృద్ధుడు కూడా కన్నూమిన్నూ కానకుండా బాలికపై దారుణానికి వడిగట్టాడు. సుమారు ఐదేళ్లుగా ఈ దారుణాలు జరుగుతున్నా.. బాలిక తెలిసీ తెలియని తనం వల్ల ఎవరికీ చెప్పుకోలేకపోయింది. శనివారం క్లాసులో టీచర్.. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి చెప్పగానే బాలిక ఈ విషయాలన్నీ బయటపెట్టింది. అయితే ఈ కేసులో నిందితుల్లో ఇంకా ఎవరినీ అరెస్ట్ చేయలేదని తెలిసింది. కేసు దర్యాప్తులో ఉంది. ఈ ఘటన స్థానికంగా సంచలనం కలిగించింది.

యువకులంతా కలిసి డ్యాన్స్ వేస్తున్నారులే అనుకుంటే.. చివరికి ఇలా జరిగిందేంటి.. ఎంత పని చేశావు తమ్ముడు..

Updated Date - 2022-03-20T02:18:33+05:30 IST