Viral: రక్త పరీక్ష రిపోర్ట్ ఇంటికి తెచ్చిన తండ్రి.. వాట్సాప్‌లో కూతురికి దిమ్మతిరిగే షాక్..!

ABN , First Publish Date - 2022-10-17T23:58:08+05:30 IST

సోషల్ మీడియాలో ప్రస్తుతం తన కూతురిపై(Daughter) ఓ తండ్రి(Father) అసంతృప్తి తాలూకు ఫన్నీ ట్వీట్(Funny tweet) తెగ వైరల్(Viral) అవుతోంది.

Viral: రక్త పరీక్ష రిపోర్ట్ ఇంటికి తెచ్చిన తండ్రి.. వాట్సాప్‌లో కూతురికి దిమ్మతిరిగే షాక్..!

ఇంటర్నెట్ డెస్క్: పిల్లల కోసం తమ జీవితాన్నంతా ధారపోస్తారు తల్లిదండ్రులు. పిల్లలే సర్వస్వంగా బతుకుతుంటారు. అన్నింట్లో తమ పిల్లలే ముందుండాలని కోరుకుంటారు. కానీ..  పిల్లలకు తమ తల్లిదండ్రుల పట్ల కాస్తంత డిఫరెంట్ ఫీలింగ్సే ఉంటాయి. ‘‘బాగా చదువుకోవాలంటూ ఒత్తిడి తెస్తుంటారు.. పక్కిల్లు.. ఎదిరింట్లోని పిల్లలకు ఎక్కువ మార్కులు వచ్చాయి చూడంటూ దెప్పిపొడుస్తుంటారు..’’ ఇవీ పిల్లలు పెద్దలపై ఇచ్చే కంప్లైంట్లు. ముఖ్యంగా టీనేజర్లలో ఇటువంటి ఫిర్యాదులు ఎక్కువ. అయితే..వాళ్లు పెద్దయ్యాక ఇవన్నీ తీపి గుర్తులుగా మిగిలిపోతాయి. ఇప్పుడిదంతా ఎందుకంటే.. సోషల్ మీడియాలో ప్రస్తుతం తన కూతురిపై(Daughter) ఓ తండ్రి(Father) అసంతృప్తి తాలూకు ఫన్నీ ట్వీట్(Funny tweet) తెగ వైరల్(Viral) అవుతోంది. 


తండ్రి తనకు చేసిన ట్వీట్ గురించి ఓ మహిళ ట్విటర్‌లో ప్రస్తావించింది. ఆయన.. తన కూతురు, ఆమె స్నేహితురాలి బ్లడ్ రిపోర్టు కూడా ఇంటికి తెచ్చారు. ఇదే విషయాన్ని కూతురికి వాట్సాప్‌లో చెప్పారు. ‘‘నీది, నీ స్నేహితురాలి రిపోర్టులు కూడా తెచ్చా’’ అన్నారు. ఆమెమో అమాయకంగా ఓకే అంటూ రిప్లై పెట్టింది. ఆ తరువాత ఆమె తండ్రి కూతురికి దిమ్మతిరిగే షాకిచ్చారు. ‘‘నీ ఫ్రెండ్‌కేమో ఏ+, నీకేమో బీ-..  రక్తపరీక్షల్లోనూ నువ్వు ఇంతేనా’’ అంటూ ఫన్నీ కామెంట్ చేశారు. దీంతో.. ఆమెకు ఏంమాట్లాడాలో తెలీక.. బిక్కమొహం వేసింది. 


ఈ సంభాషణను స్క్రీన్ షాట్ తీసి ట్విటర్‌లో షేర్ చేసింది. ‘‘మిమ్మల్ని మీ నాన్నలు ట్రోల్(Troll) చేసినట్టు మరెవ్వరూ ట్రోల్ చేయలేరు’’ అంటూ ఓ కాప్షన్ జత చేసింది. ఇది నెటిజన్లకు ఎంతగా నచ్చిందంటే.. ఆ ట్వీట్ చూస్తుండగానే తెగ వైరల్ అయిపోయింది. యూజర్లు.. తమకు చిన్నతనంలో ఎదురైన అనుభవాలను పంచుకోవడం మొదలెట్టారు. ఈ పెద్దలున్నారే.. అంటూ రెచ్చిపోయారు. భారతీయ తల్లిదండ్రులు అంతా ఇంతే.. ఎప్పుడూ పక్కవాళ్ల పిల్లలతో మమ్మల్ని పోల్చుతుంటారు. అని ఓ యూజర్ ఫన్నీ ట్వీట్ చేశారు. ‘‘ఈ అంకుల్‌ను ట్విటర్‌లోకి రమ్మనండి.. భలే సరదా మనిషి.. ఇక్కడ ఇరగదీసేస్తారు..’’ అంటూ మరొకరు ప్రశంసలు కురిపించారు. ఇక నెటిజన్లు పెడుతున్న మీమ్స్‌ గురించి మాటల్లో చెప్పడం కష్టం!  కాబట్టి.. మీరే ఓ లుక్కేసి ఎంజాయ్ చేయండి. 







Updated Date - 2022-10-17T23:58:08+05:30 IST